తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కృత్రిమ శ్వాసతో ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు. ఓ భద్రతను పటిష్ట పరుస్తూ ఏదో జరగబోతుందన్న సంకేతాలు అందిస్తూనే, మరోవైపు ఆపద ఏం లేదంటూ వ్యాఖ్యలు చేయటం విశేషం.
‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది అని మీడియాతో పేర్కొన్నాడు.
అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా వివరించాడు.
స్వామి స్పందన...
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతో గుండె నిబ్బరమున్న మహిళని అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కొనియాడాడు. మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి ప్రజల ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన "జయలలితకు గుండెపోటు వచ్చిందని విని కలత చెందాను. ఆమె మానసికంగా దృఢమైన వ్యక్తి. మరో అద్భుతం జరిగిందని, ఆమె కోలుకుందని ఈ మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్లు చెబుతారని ఆశిస్తున్నాను. ఆ అద్భుతం జరిగిందో... జరగలేదో మరి కాసేపట్లో తెలుస్తుంది" అని అన్నారు. ఆమె కోలుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, అక్రమాస్తుల కేసులో జయలలితను కోర్టుకు లాగింది ఈయనే అని తెలిసిందే.
ప్రత్యేక పూజలు...
ఇక జయలలిత ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్దకు చాలా సైలెంట్ గా పోలీసు వాహనాలు చేరుకుంటున్న నేపథ్యంలో, లోపలి పరిస్థితి అనుమానాస్పదంగానే ఉన్నట్టు... ఆసుపత్రి వద్ద వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు, వందలాది మంది అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ అపోలో వైద్యులు స్పష్టం చేయడంతో... ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. తమ అమ్మ పురచ్చితలైవి ఆరోగ్య పరిస్థితి తెలియక... ఓవైపు, ఏఐఏడీఎంకే మహిళా కార్యకర్తలు కంటతడి పెడుతున్నారు. మరోవైపు, అమ్మను కాపాడాలంటూ రోడ్లమీదే ప్రార్థనలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more