అపదో వున్నవారికి అభయహస్తాన్ని అందించేకేంద్ర మంత్రులలో సుష్మాస్వరాజ్ తరువాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే భారతీయులకు భారతమాత తరువాత ఆ స్థానంలో నిలిచేలా తన సహాయక చర్యలతో చేసుకుంది సుష్మాస్వరాజ్. ఓ వైపు అమె అనారోగ్యంతో అసుపత్రిలో వున్నా.. తన శాఖకు సంబంధించిన పనులను మాత్రం సవ్యంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్తులకు సకాలంలో ఆపన్న హస్తం అందించి తానేంటో మరోసారు నిరూపించుకున్నారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.
కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న ఓ భారతీయ కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చేశారు. ‘‘సుష్మా స్వరాజ్ గారూ! మా కుటుంబం మలేసియా విమానాశ్రయంలో ఉంది. వాళ్ళ పాస్‌పోర్టులు పోయాయి. వారాంతం కావడంతో భారతీయ దౌత్య కార్యాలయం మూసివేసి ఉంది. దయచేసి సహాయపడండి’’ అని మీరా రమేశ్ పటేల్ ఓ ట్వీట్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.
దీనిపై సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. ‘‘మలేసియాలోని ఇండియన్ ఎంబసీ : ఇది ఎమర్జెన్సీ కేసు. దయచేసి ఎంబసీని తెరిచి, భారతీయ కుటుంబానికి సహాయపడండి’’ అని ట్వీట్ చేశారు. దీంతో మలేసియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రతిస్పందించి, ఆ కుటుంబంతో మాట్లాడామని, సమస్యను పరిష్కరిస్తున్నామని ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అమెరికాలో చదువుతున్న విద్యార్థిని అనూష ధూళిపాళకు కూడా సహాయపడ్డారు. అనూష ఓ ట్వీట్లో తన పాస్‌పోర్టు పోయిందని, సహాయపడాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more