తనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన అరోపణలు చేసిన నేపథ్యంలో సీఎంపై క్రిమినల్ పరువునష్టం దావా వేయాని కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ యోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సీఎంపై పరువు నష్టం దావా వేసే విషయమై ఆయన పలువురు న్యాయవాదుతో చర్చించినట్లు కూడా సమాచారం. ఆహ్మద్ పటేల్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాని గుజరాత్ సీఎం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల అరెస్టయిన ఇద్దరు ఐఎస్ఐఎస్ అనుమానితుల్లో ఒకడు పని చేసిన ఆసుపత్రి పటేల్ నిర్వహణలోనే ఉందని తెలిపారు. ఆ వ్యక్తిని ఆ ఆసుపత్రిలో నియమించడం వెనుకనున్న కారణాలతోపాటు అరెస్టు జరగడానికి కొద్ది రోజుల ముందే ఆ వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడో కూడా పటేల్ వివరించాలని డిమాండ్ చేశారు. ‘సకాలంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినందుకు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అభినందనలు చెప్పిన ఆయన. ఇలా జరిగి ఉండకపోతే, చాలా భారీ విధ్వంసం జరిగి ఉండేదని పేర్కోన్నారు.
అరెస్టయిన ఉగ్రవాదులు ఓ హిందూ మఠాధిపతిపైనా, హిందూ పుణ్యక్షేత్రంపైనా, ప్రార్థనా స్థలంపైనా దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నారని తెలిపారు. భరూచ్ లోని సర్దార్ పటేల్ ఆసుపత్రిలో ల్యాబొరేటరీ టెక్నీషియన్‌గా పని చేసిన కాసిమ్, న్యాయవాది ఉబేద్ మీర్జాలను ఏటీఎస్ అరెస్టు చేసింది. కాసిమ్ తన ఉద్యోగానికి ఈ నెల 4న రాజీనామా చేశాడు.
ఈ ఆసుపత్రి ట్రస్టీగా 2014లో అహ్మద్ పటేల్ రాజీనామా చేసినప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారని విజయ్ రూపానీ ఆరోపించారు. 2016లో ఆధునికీకరించిన ఆసుపత్రి విభాగాలను ప్రారంభించేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని అహ్మద్ పటేల్ నిర్వహించారని తెలిపారు. ఈ ఆసుపత్రి నుంచి ఉగ్రవాద అనుమానితులు అరెస్టయినపుడు అహ్మద్ పటేల్‌ను బాధ్యుడిగా చేయవద్దా? అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more