గత కొద్ది కాలంగా ఈజిప్ట్ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మీద వస్తున్న వ్యతిరేకతలు, దరిమిలా ఆయనకు అనుకూల ప్రతికూల వర్గాల మధ్య జరిగిన కొట్లాటలకు తెరదించుతూ ఈజిప్ట్ సైన్యాధికారి నిన్న రాత్రి టివి లో మోర్సీని తొలగించినట్లుగా ప్రకటించారు. ఈజిప్ట్ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసిన కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్ సిసి, తాత్కాలికంగా రాజ్యాంగం ప్రకారం నెలకొన్న న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గద్దె దించిన మోర్సీ స్థానంలో బాధ్యతలు చేపడతారని ప్రకటిస్తూ, త్వరలోనే ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. టివిలో సైన్యాధ్యక్షుడి ప్రకటన వస్తూనే కైరో లోని తెహ్రీర్ స్వేర్ లో బాణాసంచాని కాల్చి సంతోషాన్ని వెలిబుచ్చారు.
మహమ్మద్ మోర్సీ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలమే అయినా, ఆయన తన స్వప్రయోజనాలకోసం, అధికారాలను చేపట్టటానికి మాత్రమే పని చేస్తున్నారు తప్ప ప్రజాప్రయోజనాలను విస్మరించారనే ఆరోపణ వెల్లువెత్తింది. దానితో సర్వ సైన్యాధికారి మోర్సీకి పదవి నుంచి తొలగమని 48 గంటల గడువు ఇచ్చారు. అధ్యక్షుడు ఆ పని చెయ్యకపోవటంతో నిన్న రాత్రి ఆయనను తొలగించినట్టుగా ప్రకటించటం జరిగింది.
పదవీచ్యుతుడైన అధ్యక్షుడుని రహస్య స్థావరానికి తరలించటం జరిగింది. మోర్సీకి మద్దతునిచ్చే కొన్ని టివి ఛానెల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఈజిప్ట్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందేమోననే అనుమానాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తంచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more