తెలంగాణ నోట్ వ్యతిరేకంగా.. సీమాంద్రలో బంద్ జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల సీమాంద్ర ప్రజలు చేస్తున్న ఉద్యమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ నోట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆరు వారాల్లోగా అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, దాన్ని ఓడిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్ర ప్రాంత నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, 17మంది మంత్రులు, 44 మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎమ్మెల్సీలు, కేంద్రమంత్రి చిరంజీవి కూడా పాల్గొన్నారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు.
బుల్లెట్ ప్రయోగించద్దు
సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో.. ముఖ్యంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు అధికారులు, హోం శాఖ కార్యదర్శులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎక్కడా సమైక్యాంధ్ర ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించవద్దని ఆయన స్పష్టం చేశారు. డీజీపీ బయ్యారపు ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు హోం శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు.. సీమాంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాల్లో కూడా శాంతి భద్రతలను పరిరక్షించాలని, అదే సమయంలో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more