రాష్ట్ర విభజన ప్రకటన జూలై 30న చేయటం జరిగింది. అప్పటి నుండి ఢిల్లీలో రాష్ట్ర విభజనపై ఏం జరుగుతుందో అనే విషయం వీరికి ముందే తెలుసు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నోట్ గురించి ప్రతి విషయం ముందుగానే తెలిసినట్లు సమాచారం. తెలంగాణా నోట్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తెలియకపోవచ్చేమో కానీ మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు నేతలకు మాత్రం తెలుసని సమాచారం ఉంది. తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముందుగానే తెలంగాణా నోట్ గురించి సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణా నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తుందని ముఖ్యమంత్రి, కెసిఆర్ లకు ముందే తెలిసినట్లు సమాచారం. కేసీఆర్‌కైతే ఈ విషయం వారం రోజుల ముందే తెలుసుననీ.., ఆయనతో సంప్రదింపుల అనంతరమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పే పరిస్థితులు ఉన్నాయి.
కెసిఆర్ గత నెల 29 న నగరంలోని నిజాం గ్రౌండ్స్‌లో జరిగిన 'సకల జనభేరీ' బహిరంగ సభలో వచ్చే నెల 6 తర్వాత సీఎంగా కిరణ్ రెడ్డి ఉంటారో లేదో చెప్పలేమని జోస్యం చెప్పారు. అంతేగాక మొదటి వారంలో నోట్ వస్తుందని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు నోట్‌పై ముందే సమాచారముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి కూడా తెలంగాణ నోట్ వస్తుందనే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర మంత్రులు ఆయన్ను కలిసినప్పుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే నిజమనేపిస్తుంది. ఆయనను కలిసిన మంత్రులు 'తెలంగాణ నోట్' విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వేదాంత ధోరణిలో నిర్వేదంగా మాట్లాడినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం మనల్ని కాదని, కొత్త స్నేహాలు కుదిరాయని తెలంగాణపై ముందుకు వెళుతోందన్న అర్దం వచ్చేలా మాట్లాడినట్లు చెబుతున్నారు. అంతేగాక, సీమాంధ్రలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి చివరి సారిగా ప్రజాభిప్రాయాన్ని పెద్దల దృష్టికి తెద్దాం అని అన్నట్లు తెలిసింది.
టీ-ఇవ్వాలని సీమాంధ్ర మంత్రులే ప్పారు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులే తెలంగాణ ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పారని ఆ పార్టీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెప్పారని డీఎస్ గుర్తు చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులెవరూ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి రాజీనామాలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అవసరాలకనుగుణంగా మాట మర్చారని డీఎస్ విమర్శించారు. పాలకుల వైఫల్యంతోనే ఇరు ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more