‘‘చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకుంటే ఏం లాభాం ’’ మీ రాజీనామా ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఎవరి కోసం రాజీనామాలు చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారో? ఒక్కసారి ప్రజలకు చెప్పి రాజీనామాలే చేస్తే బాగుటుంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 60 రోజులు దాటిపోయింది. అప్పటి నుండి సమైక్యాంద్ర కోసం ఉద్యమాం చేస్తున్నారు. మీరు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పుడు రాజీనామాలు చేసి ఉంటే, ఫలితం దక్కిందే. సమీంద్ర ప్రజలు ద్రుష్టిలో మీరు హీరోలుగా మిగిలిపోయేవారు. కానీ మీరుఇప్పుడు రాజీనామాలు చేసిన ఫలితం దక్కదని అందరికి తెలుసు. సో మీరు సీమాంద్ర ప్రజలు ముందు .. జీరోలకు మిగిలిపోయారు. ఇక మీ రాజీనామాలను మడిచి....? అనే మాటలు సీమాంద్ర ప్రజల నుండి వినిపిస్తున్నాయి. కంత్రీ నేతలకు కేరాఫ్ గా సీమాంద్ర నాయకులు మిగిలిపోయారని.. తెలంగాణ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. సిగ్గులేని సీమాంద్ర నాయకులారా.. నమ్మిన ప్రజలను మోసం చేశారు, కన్నతల్లిలాంటి జన్మభూమికి అన్యాయం చేశారు.
‘‘యుద్ద భూమి నుండి శత్రువుల బలం చూసి వెనక్కి వచ్చిన ఉత్తరకుమార్ అనే రాజు ఉన్నడని అందరికి తెలుసు. ’’ కానీ యుద్ద భూమిలోకి దిగి.. శత్రువులతో చేతులు కలిపి, తమ బలన్నే (సీమాంద్ర ప్రజలు) శత్రువుల ముందు మెడలు నరికేసిన సీమాంద్ర నాయకులుగా చరిత్రలో పేరు తెచ్చున్నారు. మీకు సీమాంద్ర ప్రజల కంటే.. మీ పదవులు ముఖ్యం. అందుకే.. ఇలా జరిగి ఉంటుందని సీమాంద్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక మీరు రాజీనామాలు చేసిన ఒకటే , చెయ్యకపోయిన ఒకటే. మీకంటే.. ఆడ , మగ కానీ వారు సమైక్యాంద్ర కోసం పోరాటం చేసి హీరోలుగా మిగిలిపోయారు. ఇక మీ ముఖాలను మాకు చూపించకండని.. సీమాంద్ర ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ నోట్ పై కేంద్రమంత్రి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ మింగుడుపడని అంశంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ విడుదలకు ముందు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావుల మాత్రమే పాల్గొన్నారు. మిగతా సీమాంధ్ర మంత్రులు సమావేశానికి దూరంగా ఉండి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, చిరంజీవిలు రాజీనామా చేసి కాంగ్రెస్ పై నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమంలో పయనిస్తుండటంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో అత్యధికం శాతం మంది రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. ఒకప్రక్క ప్రజలు, మరోప్రక్క ఏపీఎన్జీవోల నుంచి అధిక స్థాయిలో ఒత్తిడి ఉండటంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయలేనపుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్ గా తెలంగాణ నోట్ పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్ పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్ లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more