కాంగ్రెస్ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీలో తెలంగాణ పై తీసుకున్న నిర్ణయం తరువాత ఈ అంశం పై మరో ముందడుగు పడింది. గత కొన్ని రోజులుగా దోబూచులాడుతూ వస్తున్న తెలంగాణ ఏర్పాటు విషయంలో మరో ముందడుగు పడింది. నేడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్ పై చర్చరించి ఆమోదం తెలిపింది. నేటి మధ్యాహ్నం వరకు తెలంగాణ నోట్ లేదని, ఉన్నదని నేషనల్ మీడియాకు లీకులు ఇచ్చిన కేంద్రం చివరకు తాను అనుకున్న పని సజావుగా చేసేసింది. నేటి సాయంత్రం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటన్నరసేపు హాట్ హాట్ జరిగింది. ఈ సమావేశం తరువాత కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం ప్రతిపాదించిన ‘తెలంగాణ ’ నోట్ కి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పాడు. సీడబ్ల్యూసీ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం పదేళ్ళపాటు హైదరాబాద్ ను ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.. సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరాలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ నోట్ ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. ఆ తర్వాత అసెంబ్లీకి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం జరగుతుంది. మొదటి నుండి చెప్పుకొస్తున్నట్లుగా దీనికి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు. సో... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక లాంఛనమే. ఇక సీమాంధ్రలో తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగునేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఆధాయం, అప్పుల, జనవరులు ఇతర సమస్యల పై మంత్రుల కమిటీ అద్యయం చేస్తుందని, దానికి ఆ కమిటీనే పరిష్కారం చూపుతుందని అన్నారు. కేంద్రం నిర్ణయంతో సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more