AP cm chandrababu naidu warns kcr trs party | phone tapping controversy | revanth reddy incident

Chandrababu naidu warns kcr trs party phone tapping controversy revanth reddy

chandrababu naidu, trs party, kcr, chandrababu phone tapping, trs phone tapping, revanth reddy incident, chandrababu controversy, trs party controversy, revanth reddy

chandrababu naidu warns kcr trs party phone tapping controversy revanth reddy : ap cm chandrababu naidu warns kcr and his party that if they arrest them then that is the last day for telangana govt.

నన్ను అరెస్ట్ చేస్తే.. టీఆర్ఎస్ కి అదే ఆఖరి రోజు : బాబు

Posted: 06/10/2015 01:30 PM IST
Chandrababu naidu warns kcr trs party phone tapping controversy revanth reddy

తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరికి ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వున్న ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాతో ఈ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. తనను అరెస్టు చెయ్యాల్సి వస్తే మాత్రం తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

అలాగే.. ఆడియో టేపుల వ్యవహారంలో తానెందుకు సమాధానం చెప్పాలి ఆని ఆయన ప్రశ్నించారు. ఆయన లేదా ఛానెల్ నా సంభాషనలను రికార్డు చేసి వుండొచ్చు.. లేదా సృష్టించి వుండొచ్చు. ఈ విషయంలో నేనెందుకు సమాధానం చెప్పాలి?’ అని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఛానల్ తన గురించి ఏదేదో ప్రచారం చేస్తున్నాయని వాటి మీద తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలంగా వుండేందుకు తాను చేపట్టిన చర్యలను చూసి ఓవర్లేక కేసీఆర్ తనపై రాజకీయ దాడులు చేస్తున్నారని బాబు ఆరోపించారు. ‘మనం రెండు రాష్ట్రాలుగా మారాం. మనం తప్పనిసరిగా సహాయ సహాకారాలు అందించుకుంటూ ఇరురాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎన్నోసార్లు చెప్పినా.. కేసీఆర్ అందుకు సహకరించడం లేదు’ అని పేర్కొన్నారు.

ఇక తెలంగాణలోని తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారికి మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆరేనని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఎపిసోడ్ గమనిస్తున్న వారు మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టు కన్ఫర్మ్ అయ్యింది కాబట్టే  ఆయనలా మాట్లాడుతున్నారని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎన్ని వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  revanth reddy  phone tapping  kcr  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more