బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు గందరగోళంగా సాగుతున్నాయి. విపక్ష, అధికార పార్టీలు ఒకరిపమరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావించిన బీహార్ సీఎం నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి మోదీపై ధ్వజమెత్తడం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారసభలో వారిరువురూ పాల్గొంటూ మోదీపై సంచలన వ్యాఖ్యలు కురిపిస్తున్నారు. ఇక మోదీ కూడా తనకున్న క్రేజీనెస్ తో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడంతోపాటు తన వాక్చాతుర్యంతో లాలూ, నితీష్ లపై దుమ్మెత్తి పోస్తున్నారు. తనదైన శైలిలో వారిపై సెటైర్లు వేస్తూ.. మాటల మాంత్రికుడినంటూ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న మోదీ.. నితీష్ పై మండిపడ్డారు.
మంగళవారం సీతామఢిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న మోదీ.. అసలు నితీష్ కు సిగ్గే లేదంటూ ఆయనపై ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నితీష్ నెరవేర్చలేకపోయారని ఆయన విమర్శించారు. విద్యుత్ ఇవ్వకపోతే 2015లో ఓట్లు అడగడానికి రానని గత ఎన్నికల సమయంలో నితీష్ హామీ ఇచ్చారని.. కానీ ఆ మాటను ఆయన నిలబెట్టుకోలేకపోయారని మోదీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘నితీష్ కు సిగ్గన్నదే లేదా’? అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీహార్ కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తానని తాను చెప్పానని.. కానీ రూ.లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చానని మోదీ తెలిపారు. మహాకూటమి ఒక అవకాశవాద కూటమి అని, దానివల్ల ప్రజలకు ఒరిగేగేమీ లేదని ఆయన చెప్పారు. ఏదేమైనా.. మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో నితీష్ వర్గాలు మండిపడుతున్నాయని సమాచారం.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more