Central minister jaipal reddy new passions

central minister jaipal reddy new passions, Shri Sudini Jaipal Reddy, congress party, ap bifurcation, Telangana and Seemandhra, telangana state, telangana congress leaders, rachabanda, tdp mla revantha reddy, GOM, sonia gandhi, tealangana cm jaipal reddy,

central minister jaipal reddy new passions?

జైపాల్ రెడ్డిలో కొత్త కోరికలు ?

Posted: 11/18/2013 08:26 PM IST
Central minister jaipal reddy new passions

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిలో కొత్త కోరికలు పుట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయనలో ఏదో తెలియని కోరికలు కలుగుతున్నాయాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జైపాల్ రెడ్డి పేరు రాజకీయ నాయకులకు తప్పితే.. పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు ఢిల్లీకే పరిమితమై కాంగ్రెస్ పదవులను అనుభవిస్తూ హాయిగా రాజకీయం జీవితం గడుపుతుండే వ్యక్తిగా.. రాజకీయ నాయకులకు తెలుసు. తెలుగు ప్రజలకు మాత్రం అంత తెలియని వారు జైపాల్ రెడ్డి.

 

అయితే జూలై 31న కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన పై ప్రకటన చేసిన నాటి నుండి జైపాల్ రెడ్డి చెదురు ముదురు గా మీడియా లో కనిపించేవారు. ఎప్పుడు ఢిల్లీకే పరిమితం అయ్యే జైపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో కలియ తిరగటం పై .. రాజకీయ అనుమానాలు రేకెత్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే జైపాల్ రెడ్డి గురించి గుసగుసలాడుకుంటున్నారు. అంటే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాడితే.. సిఎం పదవి కోసం ముందుగానే కర్చీఫ్ వేసిన చాలా మంది నాయకులు తెలంగాణ కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మన జైపాల్ రెడ్డి అదే బాటలో ఉన్నట్లు టీ-కాంగ్రెస్ నాయకులు అంతరమదనపడుతున్నారు.

 

రాష్ట్ర విభజనపై మీడియా ముందు హాట్ కామెంట్ చేస్తూ.. తన కాళ్లను ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రచ్చబండా కార్యక్రమంలో.. జైపాల్ రెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. సీఎం ను, వైఎస్ జగన్ టార్గెట్ చేసుకొని .. తెలంగాణ జరిగే రచ్చబండలో విభజన వేడిని పెంచుతున్నారు. అయితే టీ-కాంగ్రెస్ నాయకులే జైపాల్ రెడ్డి దూకుడు పై మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రజల తన వాణి వినిస్తున్నారని, పదవి కోసం జైపాల్ రెడ్డి పరుగులు తీస్తున్నడని, విమర్శలు టీ-కాంగ్రెస్ నాయకుల మద్య వినిపిస్తున్నాయి.

 

సోనియా ముందు విభజనకు తలాడిస్తూ, తెలంగాణ నాయకులను తనవైపు తిప్పుకొని, రాబోయే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావాలనేది జైపాల్ రెడ్డి లో బలమైన కోరిక ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జైపాల్ రెడ్డిలో ఉన్న కోరికను తెలుగుదేశం పార్టీ యంగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బయట పెట్టడం జరిగింది. సోనియా తనకు సీఎం పదవి ఇస్తుందని జైపాల్ ఆశతో ఉన్నరని రేవంత్ రెడ్డి అంటున్నారు. జైపాల్ రెడ్డి ద్రుష్టిలో సమన్యాయం అంటే తనను సీఎంను చేసి, రాహుల్ ను ప్రధానిని చేయడమే అని రేవంత్ అంటున్నారు. జైపాల్ రెడ్డిలో ఉన్న కోరికను తెలుసుకున్న టీ-కాంగ్రెస్ నేతలు ఆయన దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. చివరకు జైపాల్ రెడ్డితో ఎవరు పోటీ పడతారో చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles