Dharmana prasada rao join to ys jagan party

dharmana prasada rao join to ys jagan party, Dharmana Prasada Rao to join YSR Congress, ys jagan, Dharmana Prasada Rao, congress party, ysrcp,

dharmana prasada rao join to ys jagan party, Dharmana Prasada Rao to join YSR Congress

ధర్మాన దారేటూ?

Posted: 11/20/2013 03:32 PM IST
Dharmana prasada rao join to ys jagan party

కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గోడలు దూకే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ పార్టీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఇప్పటికే సిబిఐ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆపదలో ఉన్నప్పుడు.. వీరిని హస్తం ఆదుకోవటం మరిచిందనే బాధలో నలిగిపోతున్నారు. అదే విషయాన్ని మోపిదేవి మరోరకంగా చెప్పటం జరిగింది. వైఎస్ జగన్ కోసమే నన్ను జైలుకు పంపించారనే విమర్శలు చేయటం జరిగింది. అయితే మొత్తం మోపిదేవి వెంకటరమణ మాత్రం జైల్లో పరిచయం స్నేహితుడి జగన్ తో కలిసిపోయాడనేది సత్యం. జైలు ప్రెండ్స్ కాస్తా, రాజకీయ ఫ్రెండ్స్ గా మారిపోవటం పెద్దగా తప్పలేదని కాంగ్రెస్ నాయకులే చాటు మాటుగా అంటున్నారు.

 

అయితే ఇప్పుడు ధర్మాన పరిస్థితి ఎప్పుడు సిబిఐ వారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారో అర్థంగాక .. నిత్యం మనోవేదనతో బాధపడుతున్నారని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయన మనోవేదనను తగ్గించేందుకు మోపిదేవి ధర్మాన దారి చూపించినట్లు సమాచారం. అయితే ధర్మాన త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్దమైనట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి ? ఆయన డిసెంబర్ 3వ తేదీన వైసీపీ పార్టీలోకి చేరుతున్నారని శ్రీకాకుళం జిల్లాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను ధర్మాన ఖండించకపోవడం విశేషం.

 

దీనిపై ధర్మాన రెండు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. గత రెండు నెలలుగా వైసీపీ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ మట్టి కరుస్తుందని ఇటీవలే ధర్మాన బహిరంగ సభలోనే ప్రకటించారు. సరైన సమయం, సందర్భం కోసం ధర్మాన వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ధర్మాన సోదరుడు కృష్ణదాస్ ఇప్పటికే వైసీపీ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ధర్మాన పార్టీలోకి వస్తే తన నరసన్న పేట నియోజకవర్గాన్ని వదులుకుంటానని కృష్ణదాస్ పేర్కొంటున్నట్లు సమాచారం.

 

కాని ధర్మాన రాకను వైసీపీ పార్టీలో ఉన్న నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ధర్మాన వస్తే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని జిల్లా నేతలు వాపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక జగన్ పై తీవ్ర విమర్శలు చేశారని పార్టీ నేతలు అధిష్టానం ఎదుట పేర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ధర్మాన రాకతో.. జగన్ పార్టీలోకి మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు రావటానికి సిద్దంగా ఉన్నట్లు వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles