తెలంగాణ నష్టపోయిన పర్వాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత అంటున్నారు. కవిత ఇలా మాట్లాడటానికి కారణం ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి .. జీవోఎం కు ఒక నివేధిక సమార్పించిన విషయం తెలిసిందే. అయితే సీఎం కిరణ్ మొదటి నుండి సమైక్యవాదిగానే వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నక్సలిజం సమస్య ఎక్కువుగా ఉంటుందని, దేశమొత్తం మీద ఉన్న నక్సలిస్టుల్లో ఎక్కువ మంది ఆంద్రప్రదేశ్ వారేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. నక్సలిజం సమస్య ఎక్కువగా ఉంటుందని కేంద్ర ముందు కిరణ్ కుమార్ రెడ్డ చెప్పిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణవారే ఉన్నరని సిఎం చెప్పినట్లు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు కేసిఆర్ కూతురు కవిత తీవ్రంగా ఖండించలేదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నమని గర్వంగా చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆమె ఈ విధంగా స్పందిస్తున్నారు.అంతేకాదు..తెలంగాణ నష్టపోయినా ఫర్వాలేదు..అటుకులు తిని అయినా బతుకుతాం , అవమానంతో కాదని ఆమె అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామని కవిత అంటున్నారు.
నక్సలిజం, ఉగ్రవాదం లేని రాస్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే సత్తా తెలంగాణ సమాజానికి ఉందని కవిత అంటున్నారు. అంతేకాకుండా శ్రీశైలం ఎడమగట్టు వాటా కచ్చితంగా తెలంగాణకు వచ్చితీరుతుందని ఆమె గట్టిగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజలపై కవితమ్మకు ఎంత ప్రేముందో ఇట్టే అర్థమువుతుంది. అంటే తెలంగాణలో మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నారని బహిరంగంగానే చెబుతుంది. అంతేకాకుండా, మావోయిస్టుల వల్ల తెలంగాణ కు ఎలాంటి నష్టం లేదని కవిత చెప్పటం, తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
ఇప్పటికే మావోయిస్టులతో కలిసిపోయిన కొడుకుల తెలంగాణ తల్లుల బాధ ఏమిటో కవితమ్మకు ఎలా తెలుస్తోంది. ఎదిగిన కొడుకు అడువుల పాలై.. కన్నవారి కడుపు శోకంతో దుఖిస్తుంటే.. కవితమ్మకు పర్వాలేదా? అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అయితే కవిత గారికి ఏది అయినా నష్టం లేదు. మరి తెలంగాణ ప్రజలకు ఆ పరిస్థితి ఉంటుందా? అని తెలంగాణ ప్రజలు కవితమ్మను అడుగుతున్నారు. ఇప్పటికే .. 1200 మంది తెలంగాణ యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more