T congress leader d srinivas press meet on mlc leaders

D Srinivas press meet on MLC Leaders, T Congress Leader D Srinivas, MLC Leaders, Telangana state congress senior leader D Srinivas,

T Congress Leader D Srinivas press meet on MLC Leaders, Telangana state congress senior leader D Srinivas

వాళ్లెందుకు పార్టీ మారారో తెలుసు…! డీఎస్

Posted: 06/28/2014 08:54 AM IST
T congress leader d srinivas press meet on mlc leaders

అసలే .. చావు తప్పి కన్నులొట్టపోయిన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కొంతమందికి అన్నం పెట్టాం కాబట్టి మనకు అధికారం ఇస్తారని ఆశపడి.. సోనియా గాంధీ ఆంద్రప్రదేశ్ మ్యాఫ్ ను రెండుగా చీల్చింది. నోటికాడ అన్నాన్ని తీసి వేసిన .సోనియాగాంధీకి.. ఆంద్రప్రజలు ఘోరీలు కట్టారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోను అధికారం రాదు కాబట్టి.. తెలివిగల తెలంగాణ నేతలను నమ్ముకొని .. సోనియా గాంధీ వాతలు పెట్టించుకుంది. పాపం.. ఆ వాతలకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మందు రాయలేక అల్లాడిపోతున్నారు. మరీ కొంతమంది అయితే ఈ తలనొప్పి మాకెందుకు అనుకొని, కొన్ని గులాబీలు చేతిలో పట్టుకొని అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.

ఇలా జంప్ అయిన వారిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు.. వాళ్లెందుకు పార్టీ మారారో నాకు తెలుసు అని ప్రతి ఒక్కరు చంకలు కొట్టుకుంటున్నారు. కానీ ఒక నేత కూడా కరెక్ట్ గా వారు ఇందుకోసమే పార్టీ మారారు అని గట్టిగా చెప్పటం లేదు. ఎందుకంటే అందరు అమ్మ భజన చేసేవారు కాబట్టి. కొంచెం దైర్యం చేసి సీనియర్ నేత మాజీ పీసీసీ ఛీప్ ..ఢి. శ్రీనివాసరావు.. మీడియా ముందుకు వచ్చి...‘‘ వాళ్లెందుకు పార్టీ మారారో నాకు తెలుసు’’ నేను అమ్మతోనే చెబుతానని , లోపల ఉన్న మేటర్ అలాగే ఉంచుకోని ఢిల్లీకి బయలుదేరుతున్నారు.

అంతేకాకుండా.. వెళ్లిన వారిపై డీఎస్ ..నాలుగు హస్తం దెబ్బలు కొట్టారు. కేవలం అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీలు పార్టీ మారడం దారుణమన్నారు. ఒకరిద్దరు పార్టీ మారితే కాంగ్రెస్ కు ఏమీ కాదని…తమ పార్టీకి అంతం లేదన్నారు డీఎస్.

కాంగ్రెస్ పార్టీ పెద్ద మహా సముద్రమని వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలు వస్తే తప్పుబట్టిన కేసీఆర్…ఇప్పుడు ఫిరాయింపులను ప్రొత్సహించడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు డీఎస్. ఫిరాయింపులను ప్రొత్సహించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఇక స్థానిక సంస్ధల ఎన్నికలను రాజ్యాంగ బద్దంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరతామన్నారు.

అయినా ఢిఎస్ గారు.. జుట్టు లేని అమ్మకు ..ఎన్ని పూలు ఇచ్చిన వేస్టే కదా? రాజకీయ పార్టీలో ఓడిపోయినప్పడు..అందులోని కొన్ని రాజకీయ కప్పలు.. నిండుగా (అధికారం) ఉన్న చెరువులో దూకటం సహజమే. చెరువు నుండి పోయిన కప్పల గురించి ఆలోచిస్తే.. ఉన్న రాజకీయ కప్పలు కూడా జంప్ చేసే ఛాన్స్ చాలా ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. హస్తం అడ్డుపెటైన ..వారి ఆపుకోండి? లేకపోతే సీమాంద్రలో పార్టీలకు బూజు పట్టినట్లు.. కొనఊపీరితో ఉన్న తెలంగాణలో కూడా బూజుపడుతుందని పార్టీలోని సినియర్లు హెచ్చరిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles