Illegal lanco hills real estate project

telangana cm k chandrasekhar rao, development of telangana, congress senior leader lagadapati rajagopal, illegal Lanco Hills Real Estate Project, lagapati assets in hyderabad, lanco hills, illegal constructions in government lands, illigal buildings,

illegal Lanco Hills Real Estate Project

ఇక కేసిఆర్ ఫోకస్ లగడపాటి?

Posted: 06/27/2014 12:36 PM IST
Illegal lanco hills real estate project

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ లో ఉన్న అనేక సమ్యలపై దృష్టిపెట్టారు. ఆయన కల ఒక్కటే.. తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నారు. సీఎం కేసిఆర్ స్పీడ్ తో.. తెలంగాణ నేతలు, అధికారులు పరుగులు తీస్తున్నారు. సీఎం నోటి నుండి మాట రాక ముందే.. ఆ పని/ సమస్యపై పరిష్కారం చెబుతున్నారు.

ఇటీవల సీఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. అక్రమంగా కట్టిన బిల్డింగులు ..నెలకొరిగాయి. అయితే ఇప్పుడు కేసిఆర్ టార్గేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ సర్కార్... ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన మణికొండలోని ల్యాంకో హిల్స్ పై ఫోకస్ చేసినట్లు రాజకీయ నాయకులు మద్య చర్చల జరుగుతుంది.

ఇప్పుడు ల్యాంకో హిల్స్ కు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాలని రెవెన్యూ అధికారులను కేసిఆర్ సర్కార్ ఆదేశించింది. దీంతో, నిన్న రాజేంద్రనగర్ మండల డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్, వీఆర్వోలు ల్యాంకో హిల్స్ ను సందర్శించి, అన్ని వివరాలు సేకరించారు.

దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూములను ఏపీఐఐసీ వేలంపాటలో ల్యాంకో సంస్థ కొనుగోలు చేసింది. అయితే, ఈ భూములు వక్ఫ్ కు చెందినవని అప్పట్లోనే వివాదం తలెత్తింది. దీనిపై కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. అయితే తుది తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలో కేసీఆర్ కు, లగడపాటికి రాజకీయపరంగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇప్పటికే గురుకుల్ భూములపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్... రానున్న రోజుల్లో ల్యాంకో హిల్స్ ను టార్గెట్ చేసిన ఆశ్చర్యంలో లేదని.. గులాబీ బాస్ చర్చించుకుంటున్నారు.

కేసిఆర్, లగడపాటికి .. 2009 నుండి వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో జరిగిన విషయాలను కేసిఆర్ మనసులో పెట్టుకొని, ఇప్పుడు ప్రతీకార చర్యలు తీర్చుకుంటున్నాడని .. తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తం సాక్షిగా చెబుతున్నారు.

కానీ ఇప్పుడు సీఎం కేసిఆర్.. తాటాకు చప్పుళ్లకు, భయపడే వ్యక్తి కాదు.. ఆయన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఎవరైన ఆయన మాట వినాల్సిందే. మీకు ఇష్టం ఉన్న, ఇష్టం లేకపోయినా, కేసిఆర్ సర్కార్ చేసే పనులు చూస్తూ ఉండాల్సిందే. కాదు.. కూడదు అంటే పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోండని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు .. గులాబీ నేతలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఇక సీఎం కేసిఆర్ వర్సెస్ లగడపాటి..కొన్ని రోజులు మీడియా కు న్యూస్ పండగే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles