Ex cm kiran kumar reddy to join bjp

kiran kumar to join bjp, kishan reddy meets kiran kumar, kiran kumar to join bjp with 30 leaders, kiran kumar joining okayed by bjp high command, kiran kumar and kishan reddy meet

kiran kumar to join bjp

కిరణ్ కి కాషాయ ఖండువా?

Posted: 06/26/2014 05:43 PM IST
Ex cm kiran kumar reddy to join bjp

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అవటంతో ఆయన భాజపాలో చేరతారని కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు నిజమేనేమో అనిపిస్తోంది.

కిషన్ రెడ్డితో చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి భాజపా లో చేరటానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

గురువారం ఉదయం 11.00 గంటలకు కిషన్ రెడ్డితో కిరణ్ కుమార్ చేసిన సమావేశం 45 నిమిషాలపాటు నడిచింది.  వాళ్ళిద్దరూ రాష్ట్రంలోని పలు రాజకీయ అంశాలమీద చర్చించుకున్నట్లుగా సమాచారం.  కానీ, జరిగింది కేవలం మామూలు మాటలేనని రాజకీయంగా ఏమీ మాట్లాడుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు.  కేవలం తను వెళ్తున్నప్పుడు కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డితో మర్యాదపూర్వకంగానే మాట్లాడటం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు.  

అయితే, విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి 30 మంది అనుచరులతో భాజపా లో చేరటానికి సిద్ధపడగా అందుకు అధిష్టానం నుంచి కూడా
అనుకూల సంకేతాలు వచ్చాయని, ఈ రోజు వాళ్ళిద్దరి భేటీకి కూడా అదే కారణమని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles