Ponnala lakshmaiah to be removed from pcc post

ponnala lakshmaiah, removed pcc president, D.Srinivas, responsibilities

ponnala lakshmaiah, removed pcc president, D.Srinivas, responsibilities

పోన్నాలకు పదవీ ‘గండం’.. ?

Posted: 10/14/2014 03:22 PM IST
Ponnala lakshmaiah to be removed from pcc post

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పదవీ గండం పోంచివుంది. ఆయన త్వరలోనే ‘మాజీ’ కాబోతున్నారన్న వార్తలు గాంధీ భవన్ పరిసరాల్లో షికార్లు చేస్తున్నాయి. అధిష్టానం నుంచి పిలుపు ఆయనకు పిలువురావడమే ఇందుకు కారణంగా వినబడుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో, అందరి నేతలను ఒక్కతాటిపైకి తేవడంతో పోన్నాల విఫలం చెందారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అయనకు పదవీ గండం వుందంటూ పుకార్లు షికార్లు కోడుతున్నాయి. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పగ్గాలను డి.శ్రీనివాస్ కు అప్పగించే అవకాశాలు వున్నాయన్న వార్తలు అందుతున్నాయి.

మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్, రెండుసార్లు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డీఎస్ హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో మంతనాలు జరపడం..  తెలంగాణా కాంగ్రెస్లో ఈ చర్చకు దారి తీస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకురాడంలో డీఎస్ కృషి వుందని అధిష్టానం భావిస్తుంది. అందుకనే సొంత నియోజక వర్గంలో మూడుసార్లు ఓడిపోయినా డీఎస్కు  కాంగ్రెస్ అధిష్టానం  ప్రాధాన్యతను ఇస్తూనే వస్తోంది. డీఎస్ ఎమ్మెల్సీ పదవి మరో ఆరు మాసాల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సోనియాను కలిసిన డీఎస్ తెలంగాణా పిసిసి పగ్గాలను అందించాలని కోరినట్లు సమాచారం.

ఇప్పటికే పొన్నాల నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఆయన్ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీలో పలువురు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ మంతనాలు, పొన్నాలను అధిష్టానం నుంచి పిలుపు రావటం మరోసారి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles