Komatireddy brothers planning to tour in car

komatireddy brothers, venkat reddy, rajgopalreddy, nalgonda, MLa, minister, chief minister, KCR, Telangana

komatireddy brothers planning to join Trs

షి‘కారు’ సిద్దమవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Posted: 10/15/2014 10:55 AM IST
Komatireddy brothers planning to tour in car

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మనసు టీఆర్‌ఎస్‌ పైకి మళ్లిందా ? ఆయన అధికార పార్టీ వైపు చూస్తున్నారా ?.. ఇందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి. ముందుగా తాను కరుడుగట్టిన తెలంగాణ వాదినని, ఆ తరువాతే తాను రాజకీయావాదినని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇదిలావుంటే.. అధికార టీఆర్ఎస్ కొనసాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్.. టీడీపీ నుంచి కాంగ్రెస్ నేతల వైపు మళ్లిందా..? అంటే కూడా అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. కాంగ్రెస్ లో గ్రూపు తగదాలు, రాజకీయాలతో ఇమడలేని వారు, నాయకత్వ లేమితో పొసగలేని నేతలను..  టీఆర్ఎస్ తమ వైపు తిప్పుకునే ప్రయాత్నాలు చేస్తోందని టాక్.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యత్ సౌదాలో జరిగిన ఘటనపై స్పందించి.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేయడం సిగ్గుగా వుందంటూ.. మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి.. ఆ తరువాత కూడా ఉద్యమంలో క్రీయాశీలకంగానే పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు టికెట్ల పంపిణీ సమయంలోనూ వారి పేర్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. అయినా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆఱ్ తన వాహనం దిగిన వెంటనే.. ఆయనను కలిసి.. ఆయనకూడానే సీ బ్లాక్‌లోకి వెళ్లారు. గంటకుపైగా వారి మధ్య మంతనాలు జరిగాయి. అయితే త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీలో కారులో చేరేందుకు కోమటిరెడ్డి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ప్లీనరీ అనంతరం జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామి ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. సీఎంతో భేటీ ముగిసిన పిదప కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు చెప్పారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినందున విద్యుత్‌ కోతల నివారణకు అప్పుడే ఎం చేయగలదని ఆయన ప్రభుత్వాన్ని వెనకేసురావడం పార్టీ ఫిరాయింపులకు మొగ్గు చూపుతున్నారన్న సందేహాలకు అస్కారం ఇస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : komatireddy brothers  venkat reddy  rajgopalreddy  nalgonda  MLa  minister  chief minister  KCR  Telangana  

Other Articles