78 percent don’t want land bill: Survey

63 percent say pm modi s image anti poor survey

78 percent don’t want land bill, 63 percent say PM Modi’s image anti-poor, Prime minister Modi, Narendra modi, land bill, opinion poll, India TV-C Voter opinion poll, land acquisition bill,

A whopping 78 percent respondents have demanded the NDA government withdraw its land acquisition bill, said an opinion poll

మసకబారుతున్న ప్రధాని మోడీ మానియా..?

Posted: 05/17/2015 06:54 PM IST
63 percent say pm modi s image anti poor survey

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకా..? కేంద్ర ప్రభుత్వం పేదల వ్యతిరేకేనా..? భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్రను నెలకోల్పిన నరేంద్ర మోడీ.. మోడీ మానియా, నమో మంత్రం ఇప్పడు మసకబారుతుందా...? ప్రజలలో నెలకోన్న అభిమానం పటాపంచలు అవుతోందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో 60 మాసాల అధికారం కోరిన నరేంద్రమోడీకి మూడు దశాబ్దాల పాటు సార్వత్రిక ఎన్నికలలో కనివిని ఎరుగని భారీ మోజారిటీని కట్టబెట్టారు దేశ ప్రజలు..  

అయితే 60 మాసాల అధికారంలో అప్పుడే చూస్తుండగానే 12 మాసాలు గడిచిపోయాయి. ఈ ఏడాది కాలంలో నగదు బదిలీ పథకాన్ని పేరుమార్చి ప్రధాని జన్ దన్ యోజనా పథకం, ప్రధాని భీమా పథకంతో పాటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ప్రాధాన్యతతో తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ పథకాలు మాత్రమే తప్ప ఇతర పథకాలేమి ప్రజలకు గుర్తు లేవు. మరోవైపు ప్రధాని ఎన్నికల ప్రచారంలో చెప్పిన అచ్చే దిన్ అయేంగే.. ఇంకా అమలుకు నోచుకోనూ లేదు. అసలు తమకు ఏం మంచి చేయనున్నారో కూడా ప్రధాని చెప్పలేదని, అచ్చే దిన్ అన్నారే తప్ప.. ఎప్పుడు ఆ రోజులు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ క్రమంలో ప్రభాని తీసుకువచ్చిన భూ సంస్కరణ చట్టం సవరణలకు చట్టబద్దత లభ్యం కాలేదు. అవుతుందన్న నమ్మకమూ లేదు., కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ భూ సేకరణ చట్టానికి చేసిన మార్పులను వ్యతిరేకిస్తున్నాయి. రైతు చేసే ఉత్సాదన మేక్ ఇన్ ఇండియా కాదా..? వారి భూములను లాక్కుని కార్పోరేట్లకు దారదత్తం చస్తారా అంటూ.. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రథాని నరేంద్రమోడీ ప్రభుత్వం పేద ప్రజల వ్యతిరేకన్న టాక్ కూడా సొంతం చేసుకుంటోంది. ఇందుకు కూడా భూ సేకరణ చట్టంలో చేసిన మార్పులే కారణంగా నిలుస్తున్నాయి.

మోడీ ప్రభుత్వం పేద వ్యతిరేకి, రైతు వ్యతిరేకన్న ప్రతిపక్షాల మాటలు అటు దేశవ్యాప్తంగానూ ప్రజల్లో వినబడుతున్నాయి. దేశానికి మకుటంలా వున్న రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలలో అబాసుపాలవ్వడం కేవలం మూడు స్థానాలను మాత్రమే బీజేపి గెలుచుకోవడం ఆయన ఏడాది పాలనకు రిఫరెండం కాదని  పార్టీ వర్గాలు వెనకేసుకోచ్చినా.. తాజాగా తెరపైకి వచ్చిన భూసేకరణ బిల్లు విషయంలో మాత్రం దేశ ప్రజల నుంచి కూడా ఈ తరహా అంచనాలే వెల్లువెత్తుతున్నాయిన ఇండియా టీవీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రజానాడి (ఓపీనియన్ పోల్)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ తీసుకోచ్చిన భూ సేకరణ బిల్లు సంస్కరణలను 78 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాగా 63 శాతం మంది నరేంద్రమోడీ ప్రభుత్వం, పేద, రైతు వ్యతిరేకని అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రాంతాల వారీగా చూస్తే.. 65 శాతం మంది ఉత్తరభారతావణి ప్రజలు, 52 శాతం పశ్చిమభారత ప్రజలు, 38 శాతం దక్షిణాది ప్రజలు, 34శాతం మంది తూర్పు భారతావని ప్రజలు నరేంద్రమోడీ పాపులారిటీ తగ్గిందని భావిస్తున్నారని సర్వే తెలిపింది. కాగా ప్రధాని కన్నా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ముందంజలో వున్నారు.

మోడీ ఎడాది పాలనతో సంత్తృగా వున్నామని 59 శాతం మంది ప్రజలు అభిప్రాయపడితే.. 41శాతం మాత్రం నిద్వందంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ధరాఘాతం ఏమాత్రం తగ్గలేదని 64 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా,  నల్లధనం వెలికితీత విషయంలో అదేస్థాయిలో మోడీ సర్కారుకు చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ భారత్ మినహా కేంద్ర ప్రభుత్వ ఇతరత్రా పథకాలలో దేనిపై కూడా ప్రజలకు అంతగా అవగాహన లేదని కూడా సర్వే స్పష్టం చేసింది. కాగా 19 శాతం మందికి జన్ ధన్ యోజన, 18 శాతం మందికి మేక్ ఇన్ ఇండియా, 11 శాతం మంతికి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకాలు తెలుసునని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anti-poor  Land Bill  Narendra Modi  New Delhi  Survey  

Other Articles