‘కలవారి కోడలు’ సీరియల్‌తో ఆయనెవరో అందరికీ తెలిసింది. గమ్యం, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో ఆయన ప్రతిభేంటో అర్థమయ్యింది. వైవిధ్యమైన నటన, విశిష్టమైన డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకునే ఆయన... రావు రమేష్. రావుగోపాలరావు లాంటి ఓ గొప్ప నటుడి కొడుకుగా కాకుండా, తానే ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్... తన తండ్రి గురించి ఇతరులకు తెలియని కొన్ని విషయాలు మీకోసం.... రావుగోపాలరావుగారి అబ్బాయి అయివుండీ సినిమాల్లోకి రాకుండా మొదట టీవీలో చేశారెందుకు? గోపాలరావుగారికి మీరెంతమంది పిల్లలు? సెలెబ్రిటీ పిల్లలుగా మీ బాల్యం ఎలా గడిచింది? సినిమాల్లో నాన్న భయపెట్టేవారు. నిజ జీవితంలో ఎలా ఉండేవారు? అమ్మ గురించి...? నాన్నగారి గురించి మరికొన్ని కబుర్లు...? నాన్నతో కలసి షూటింగులకి, మరెక్కడికైనా బయటికి వెళ్తుండేవారా? ఆయన మిమ్మల్ని బాగా మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆయన ప్రోత్సాహం ఎలా ఉండేది? అసలు మీకు నటుడవ్వాలని ఎప్పుడనిపించింది? నాన్నగారి ప్రభావమెంత? నాన్నగారి ఫేమ్ ఎంత వరకు ఉపయోగపడింది? నాన్న చేసిన పాత్ర ఏదైనా మిమ్మల్ని చేయమంటే దేన్ని ఎంచుకుంటారు? |
‘కలవారి కోడలు’ సీరియల్‌తో ఆయనెవరో అందరికీ తెలిసింది. గమ్యం, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో ఆయన ప్రతిభేంటో అర్థమయ్యింది. వైవిధ్యమైన నటన, విశిష్టమైన డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకునే ఆయన... రావు రమేష్. రావుగోపాలరావు లాంటి ఓ గొప్ప నటుడి కొడుకుగా కాకుండా, తానే ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్... తన తండ్రి గురించి ఇతరులకు తెలియని కొన్ని విషయాలు మీకోసం....
పవిత్రబంధం, కలవారి కోడలు సీరియల్స్ చాలా మంచి పేరు తెచ్చాయి. తర్వాత సీమసింహం, ఒక్కడున్నాడు చిత్రాలు చేశాను. గమ్యంతో బ్రేక్ వచ్చింది. కొత్త బంగారు లోకం, మగధీర, శంభో శివ శంభో, విలేజ్‌లో వినాయకుడు, ఖలేజా, ఆకాశరామన్న , పిల్ల జమిందార్ వంటి సినిమాలు నటుడిగా తృప్తినిచ్చాయి. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ్‌రామ్, త్రివిక్రమ్ చిత్రాలు చేస్తున్నాను.
రావుగోపాలరావుగారి అబ్బాయి అయివుండీ సినిమాల్లోకి రాకుండా మొదట టీవీలో చేశారెందుకు?
బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావనడానికి నేనే ఉదాహరణ. నటుడిగా నిరూపించుకోడానికి సీరియల్లోనే ముందు అవకాశమొచ్చింది. అక్కడ సక్సెస్ అయ్యాక సినిమాలపై దృష్టిపెట్టాను.
గోపాలరావుగారికి మీరెంతమంది పిల్లలు?
ముగ్గురం. నేనే పెద్దవాడిని. తమ్ముడు అమెరికాలో సెటిలయ్యాడు. చెల్లెలు హైదరాబాద్‌లోనే ఉంది.
సెలెబ్రిటీ పిల్లలుగా మీ బాల్యం ఎలా గడిచింది?
చిన్నతనమంతా చెన్నైలో ఉన్నాం. అప్పుడు అక్కడ తెలుగు సినిమాలు చూసేవాళ్లు తక్కువ కదా. అయినా నాన్న గురించి తెలిసినవాళ్లంతా మమ్మల్నీ ప్రత్యేకంగా చూసేవారు. ఎప్పుడైనా ఆంధ్రాకి వస్తే మాత్రం నాన్న పాపులారిటీని బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.
సినిమాల్లో నాన్న భయపెట్టేవారు. నిజ జీవితంలో ఎలా ఉండేవారు?
బయట కూడా నాన్నంటే అందరికీ భయమే. నిజానికి ఆయనేం అనేవారు కాదు. కనీసం మమ్మల్ని తిట్టేవారు, కొట్టేవారు కూడా కాదు. కాకపోతే చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన ఇంట్లో ఉంటే, చీమ కూడా చిటుక్కుమనేది కాదు. (నవ్వుతూ) బెంగాల్ టైగర్ ఇంట్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉండేది.
అమ్మ గురించి...?
అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్. అమ్మ ఫేమస్ హరికథ ఆర్టిస్ట్. కొన్ని వేల ప్రదర్శనలిచ్చారు. నాన్న నోరు తెరిచి చెప్పకముందే ఆయనకేం కావాలో అమ్మ కనిపెట్టి ఏర్పాటు చేసేది. అన్నీ వడ్డించి ‘భోజనానికి రండి’ అని అమ్మ పిలిస్తే కానీ నాన్న కదిలేవారు కాదు.
నాన్నగారి గురించి మరికొన్ని కబుర్లు...?
ఆయన గొప్ప నటుడే కాదు వ్యక్తి కూడా. ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో ఉండేవారు. అమ్మని కూడా నువ్వు అనేవారు కాదు. కుమార్జీ (కమల్ కుమారి) అనే పిలిచేవారు. ఆయన దేవుణ్ని నమ్మేవారు కాదు. అమ్మేమో ఎప్పుడూ పూజలు, నోములు అంటూండేది. తనకి మాత్రం ఎప్పుడూ అభ్యంతరం చెప్పేవారు కాదు నాన్న. ఎదుటివాళ్ల భావాల్ని అంతగా గౌరవించేవారు!
నాన్నతో కలసి షూటింగులకి, మరెక్కడికైనా బయటికి వెళ్తుండేవారా?
ఎప్పుడూ లేదు. నాన్నతో కలిసి ఒకే ఒక్క సినిమా చూశా... అది కూడా కిక్కురుమనకుండా కూర్చుని! ఆ సినిమా... ‘ఎ పాసేజ్ టు ఇండియా’. దాని దర్శకుడు డేవిడ్ లీన్ అంటే నాన్నకు చాలా ఇష్టం.
ఆయన మిమ్మల్ని బాగా మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా?
నాన్నగారికి నా వొకాబులరీ స్కిల్స్ చాలా నచ్చేవి. ‘ఒకసారి ఇది చదువు నాన్నా’ అంటూ నాతో పేపర్లో ఎడిటోరియల్స్ చదివించేవారు. తెలుగు తప్పుగా చదివితే మాత్రం కోప్పడేవారు. ‘తెలుగువాడిగా పుట్టి తెలుగు సరిగ్గా రాకపోవడం దౌర్భాగ్యం. భాషను హత్య చేసి హంతకుడివి కాకు’ అనేవారు. నాన్న అలా ట్రెయిన్ చేయడం ఈరోజు నాకెంతో ఉపయోగపడుతోంది.
ఆయన ప్రోత్సాహం ఎలా ఉండేది?
ఓసారి ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ‘నువ్వొక్కడివే బతకడం అనాగరికం. నలుగుర్ని బతికిస్తూ... నువ్వు బతకడం నాగరికం’ అన్నారు. ఆయన ఆలోచనలు అంత ఉన్నతంగా ఉండేవి!
అసలు మీకు నటుడవ్వాలని ఎప్పుడనిపించింది? నాన్నగారి ప్రభావమెంత?
నటుడవ్వాలన్న ఆలోచన నాకస్సలు లేదు. ఫొటోగ్రాఫర్ అవ్వాలనుకున్నాను. కానీ నాన్న చనిపోయాక అంతా అయోమయంగా తోచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అమ్మ నన్ను నటించమంది. నేనేమో దర్శకుడినవుతానన్నాను. అప్పుడావిడ ఒకే మాటంది- ‘‘జీవితం తెలిస్తే దర్శకుడవుతాడు. సన్నివేశాన్ని పండించాలంటే జీవితానుభవం ఉండాలి. దర్శకుడికి 24 క్రాఫ్ట్స్ తెలియాలి. ముందు ఒకదాన్ని సక్రమంగా చెయ్యి. తర్వాత దర్శకత్వం గురించి ఆలోచించు’’ అని. ఆ మాటలే నన్ను నటుడిని చేశాయి.
నాన్నగారి ఫేమ్ ఎంత వరకు ఉపయోగపడింది?
నాన్న ఫేమ్ వల్ల అవకాశాలు రాలేదు కానీ ఎక్కడికెళ్లినా ఎంతో గౌరవం మాత్రం దక్కింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ నగేష్ (నటుడు) ఓ మాటన్నారు- ‘ఇక్కడితో ఓ చరిత్ర ముగిసిపోయింది. రేపట్నుంచి మీ ఇంట్లో ఫోన్ మోగితే నా పేరు మార్చుకుంటాను’ అని. అది ముమ్మాటికీ నిజం. ఏదైనా మనిషి ఉన్నంతవరకే.
నాన్న చేసిన పాత్ర ఏదైనా మిమ్మల్ని చేయమంటే దేన్ని ఎంచుకుంటారు?
ముత్యాల ముగ్గు, భక్త కన్నప్పలోని పాత్రలు. అయినా ఓ అద్భుతమైన పాత్రను మళ్లీ మరొకరు చేయాలనుకోవడం దాన్ని పాడు చేయడమే అవుతుంది. అందుకే నేను అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను కానీ అవే చేయాలనుకోవట్లేదు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more