Veturi sundararama murthy jayanthi

veturi , 29 jan, telugu lyric writer, sundararama murthy, birthday, tollywood best songs writer veturi veturi sundararama murthy jayanthi,date,

Veturi Sundararama Murthy birthday, date of Veturi Sundararama Murthy Jayanthi, 29 jan telugu lyric writer,tollywood best songs writer veturi

Veturi-Sundararama-Murthy-Jayanthi.GIF

Posted: 01/30/2012 12:48 PM IST
Veturi sundararama murthy jayanthi

Veturi-Sundararama-Murthy-Jayanthi2

Veturi-Sundararam-murtyతెలుగు సినీ సీమ ఎందరో మహానుభావుల్ని మరచిపోలేని వ్యక్తులుగా మనకు పరిచయం చేసింది... ఎన్ని దశాబ్దాలు మారినా, మనం ఎన్ని అడుగులు ముందుకు వేసినా, రంగుల ప్రపంచం లో తమకంటూ ఒక పేరుని, గుర్తింపుని సంపాదించుకున్న వ్యక్తుల గురించి మనం ఎప్పటికీ, ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం. అలా సిని గేయ రచనా లోకానికి ఒక మైలు రాయి, స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు... జనవరి 29 , మహనీయుడి జయంతి...

పాటలో విరహం పలికించాలన్న, అనురాగం పంచాలన్న, ప్రణయంతో పులకరింపచెయ్యాలన్న, లేక భక్తీ సాగరంలో పరవశింపచెయ్యాలన్న, అది వేటూరి వారికే సొంతం. పాటలకి ఆయన అందించే మాటలు అర్ధం చేసుకోడానికి ఎంత కష్టమో, ఒకసారి అనుభవంలోకి వచ్చాక అంతే సులభం. ఎన్ని వేల పాటలు, ఎన్ని భాషలలో రాసిన, తెలుగు భాషపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పేవారు వేటూరి...

స్వర్గవాసులు కాకముందు ఒకానొక సమయం ఆయన ఇంటర్యూలో "తెలుగులో పాటలు, మాటలు రాయాలంటే, ముందుగా భాషాపై అవగాహన ఎంతో అవసరం... అన్నమయ్య వంటి వారి రచనలకు అర్ధం తెలియడం అవసరం, మన పూర్వీకుల రచనా సంపుటిపై అవగాహన అవసరం, ఇన్ని పూర్తిగా తెలుసుకుని, ఆపై పాటల రచనలకు పూనుకోవడం, మన పెద్దలకు మనం అందించే కనీస మర్యాద", అన్నారు వేటూరి...

Veturiమనసుతో వయసుకు సంబంధంలేదు అని నిరూపించారు వేటూరి... ఏడు పదుల వయస్సు దాటినా, 'గోదావరి' సినిమాలో 'ందంగా లేన' వంటి పాటలతో ఆయన సత్తా ఎంతో నిరూపించుకున్నారు.. ఆచార్య ఆత్రేయ వంటి వారిని తన గురువుగా భావించే వేటూరి, ఈనాటి రచయితల్ని ద్రౌపదితో పోల్చారు.. "ద్రౌపదికి అయిదుగురు మొగుళ్ళు... మరి గేయ రచయితలకు అంతే. సంగీత దర్శకుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, ప్రేక్షకులు, వీళ్ళందరి భావాలని దృష్టిలో పెట్టుకుని పాట రాయాలి... మరి ఇందులో రచయితా స్వంత భావాలు గాలిలో కలసిపోయినట్టే... ఈనాటి రచయితా అందరిని తన పాటతో మెప్పించే పరిస్థితి, తనకంటూ స్వేచ్చలేని స్థితి ఏర్పడ్డాయి", అన్నారు వేటూరి... అలాగే ఒక రచయితకి భాష పై అవగాహన తో పాటు, కనీస సంగీత గ్యానం కూడా ఉండాలని, అప్పుడే, సంగీతంలో భావానికి అనుగుణంగా మాటలు రాయగలడని కూడా, ఇప్పటి రచయితలకు సూచన ఇచ్చారు, రచయిత...

'సాగర సంగమం' లోని, 'నాద వినోదం' పాటలో, 'శివుని త్రయలాస్యం' వంటి పదం, 'కొండవీటి దొంగ' లో 'సుభాలేక రాసుకున్న' పాటలో, 'పుష్యమి పువ్వుల పూజ చేస్తా' వంటి పదాలు వేటూరి రచనకే సొంతం. అయితే ప్రతీ పదానికి సుధీర్గ వివరణ ఇచ్చెంతటి పరిగ్యానం ఉన్న రచయితా వేటూరి...

ఆయన పొందుపరచిన అద్భుత రచనా సంపుటి, మనకు యెనలేని సంపద...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthday to brahmanandam
Interview with rao ramesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles