Reliance industries investing high amount of money to reach top 50 companies list in the world

Reliance industries investing high amount of money to reach top 50 companies list in the world, reliance industries, reliance industries news, reliance industries shares in market, mukhesh ambani, mukhesh ambani with narendra modi, mukhesh ambani latest interview, mukhesh ambani with family members, reliance industries to invest high amount of money to reach top 50 companies list in the world, reliance industries shares, investments of reliance industries

Reliance industries investing high amount of money to reach top 50 companies list in the world

భారీగా పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్

Posted: 06/19/2014 07:01 PM IST
Reliance industries investing high amount of money to reach top 50 companies list in the world

(Image source from: Reliance industries investing high amount of money to reach top 50 companies list in the world)

గత కొద్దికాలాల నుంచి లాభనష్టాల మధ్య సమస్యలను ఎదుర్కుంటూ తూలుగుతూ వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీలో... తన మునుపటి చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమయ్యింది. ఎవరికీ సాధ్యం కాని విషయాలను సాధ్యం చేస్తూ తమదైన రికార్డులను సృష్టించుకుంటూ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద 500 కంపెనీల్లో 135వ స్థానంలో వున్న ఈ ఇండస్ట్రీస్... టాప్ 50లో స్థానం దక్కించుకోవడానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఈ విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి అయిన ముఖేష్ అంబానీ తన తాజా బిజినెస్ డీల్స్, పెట్టుబడుల గురించి వివరిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

గత 37 ఏళ్లలో ఇప్పటివరకు సాధించిన విజయాల ఆధారంగా ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయినే కేవలం మూడేళ్లలోనే సాధించాలనే నిశ్చయంతో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. గత 37 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,40,000 కోట్లవరకు పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ... వచ్చే మూడు సంవత్సరాలలో అదే స్థాయిలో దాదాపుగా రూ. 1,80,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు భారీ ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ... ‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈసారి చరిత్రలోనే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఈ నిర్ణయం ప్రపంచంలోనే 50 అగ్రగామి కంపెనీల్లో రిలయన్స్ ను చేరుస్తుందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. నాన్న కన్న కలలను నేను మరింతగా రుజువు చేయడానికి ముందుడుగు వేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది’’ అని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు.

బుధవారంరోజు నాడిక్క కంపెనీ 40వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వున్న వాటాదారులను ఉద్దేశించి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్ కార్యాచరణ గురించి ముఖేష్ అంబానీ వెల్లడించారు. గత దశాబ్దకాలం నుంచి భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కనిష్టస్థాయికి దిగజారిపోయినా... భారతదేశంపై రిలయన్స్ కు వున్న ప్రగాఢ విశ్వాసంతోనే ఈ విధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని చెప్పారు. ఈ సమావేశంలో ముఖేష్ అంబానీతోపాటు అతని భార్య నీతా, తనయులు ఆకాశ్, అనంత, తల్లి కోకిలా బెన్ లు హాజరయ్యారు.

అదేవిధంగా ముఖేష్ అంబానీ తమ సంస్థ గురించి వివరంగా చెబుతూ... ‘‘ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో అతిపెద్ద 500 కంపెనీల్లో 135వ స్థానంలో వుంది. అయితే టాప్ 50లో స్థానం దక్కించుకోవాలంటే పెట్రో రసాయనాల యూనిట్లు, ఇంధన వ్యాపార విస్తరణ, మరిన్ని రిటైల్ విక్రయ కేంద్రాలను ప్రారంభించడం, టెలికాం రంగంలో బారీ పెట్టుబడులు పెట్టాలి. అందుకు అన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేశాం. వచ్చే మూడేళ్లలో పెట్టబోయే రూ.1,80,000 పెట్టుబడులు అధికంగా ఈ రంగాలకే కేటాయిస్తాం’’ అని వాటాదారులతో పేర్కొన్నారు. 2017కల్లా రుణరహిత కంపెనీగా రిలయన్స్ మారుతుందని భరోసా ఇచ్చారు.

ఈ విషయాలన్నీ ఒక పట్టాన పెడితే... రిలయన్స్ కంపెనీ గత 20 సంవత్సరాల్లో అత్యధికంగా ఆస్తులను సృష్టించడంలో తనదైన ఘనతను సంపాదించుకుంది. కంపెనీ ప్రారంభించిన మొదటి 30 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలోనే పోటీపడే విధంగా పెట్రోరసాయనాలు, చమురు శుద్ధి, మార్కెటింగ్, గ్యాస్ అన్వేషణ వెలికితీత వంటి వ్యాపారాలను విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 14.7 శాతం వుండగా... ప్రైవేటు రంగంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్నది కేవలం ఈ రిలయన్స్ ఇండస్ట్రీయే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles