(Image source from: modi government increases train charges which is becoming a controversial news in India)
యావత్తు భారతదేశం మొత్తం ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయిన మోడీ ప్రభుత్వం... సామాన్య ప్రజల మీద ధరల మోత వాయించేస్తోంది. గతంలో ఇటువంటి ధరల వివాదాల మీదే ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడిన బీజేపీ... ఇప్పుడు ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. సమాజాన్ని అభివృద్ధి బాటవైపు నడిపిస్తాం అంటూనే... జేబులు ఖాళీ చేయించేస్తోంది. ‘‘మేడిపండు చూడు మేలిమై వుండు’’ అన్నట్టుగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రచారాలు చేసుకున్న ఈ మోడీ ప్రభుత్వం... ఎన్నికల తరువాత ‘‘పొట్టవిప్పి చూడు పురుగులుండు’’ అన్న ధోరణితో వ్యవహరిస్తోందని అప్పుడే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా మోడీ ప్రభుత్వం రైల్వే ఛార్జీల రేటును పెంచిన విషయం అందరికీ తెలిసిందే! ఇందులో ప్రయాణికుల ఛార్జీ 14.2 శాతానికి పెంచగా... సరుకు రవాణాను 6.5 శాతనికి పెంచి పారేశారు. దీంతో రైల్వేలు ప్రతి సంవత్సరం రూ.8000 కోట్లమేరకు ఆదాయాన్ని అదనంగా పొందుతుంది. బడ్జెట్ కు సంబంధించి ముందస్తు చర్యల్లో ఈ విధంగా ధరలు పెంచాల్సి వచ్చిందని మోడీ ప్రభుత్వం ప్రజలకు సర్దిచెప్పుకుంది. అయితే ఈ విధంగా ఛార్జీలను ఒక్కసారిగా పెంచడంతో విపక్షపార్టీ నేతలు బీజేపీ పార్టీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ‘‘పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా నెలరోజులైనా కాలేదు... అప్పుడే తన విశ్వరూపంతో సామాన్య ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి తక్షణ నిర్ణయాలను తీసుకోలేదు’’ అంటూ మండిపడ్డారు. ఇలా రకరకాలుగా చాలామంది నాయకులు బీజేపీ పార్టీ వైఖరిపై విమర్శల జల్లులు కురిపించారు.
ఈ విధంగా ధరలు పెరిగిన నేపథ్యంలో ఉక్కు ధరలు (టన్నుకు రూ.600 వరకు) కూడా పెరగనున్నాయని తాజాగా వెల్లువడిన సమాచారం! ఎందుకంటే... తయారీదార్లు కీలక పదార్థమైన ముడి ఇనుము, తుది ఉత్పత్తుల రవాణాపై మరింతగా వెచ్చించాల్సి వుంటుంది. ఇందులో భాగంగానే ఈ పరిశ్రమకుల చెందిన ఒక విశ్లేషకుడు... ‘‘రవాణా ఛార్జీలు పెరగడంతో దాని ప్రభావం ఉక్కు తయారీదార్ల మార్జిన్లపై కూడా పడుతుంది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు టన్నుకు రూ.300-600 దాకా ధరలను వారు పెంచవచ్చు’’నని మీడియా సమావేశంలో వెల్లడించారు.
అలాగే భారత ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) కూడా... ‘‘దాదాపు అన్ని ఉక్కు తయారీ కంపెనీలు ముడి ఇనుమును చాలావరకు రైలు ద్వారానే రవాణా చేసుకోవడం వల్ల.. వినియోగదార్లపై ఖచ్చితంగా రవాణా ఛార్జీల పెంపు పడుతుంది’’ అని అభిప్రాయాన్ని వెళ్లగక్కుతుంది. సిఫి సెక్రటరీ జనరల్ అయిన ఆర్.కె.శర్మ మీడియా సమావేశంలో.. ‘‘రవాణా ఛార్జీలు పెరిగితే ముడి పదార్థాల వ్యయం కూడా అధికం అవుతుంది. పరిశ్రమలు ఈ భారాన్ని వినియోగదార్లపై బదలాయించాల్సి వస్తుంది. ఎలాగైనా చివరకు నష్టపోయేది వినియోగదార్లే’’నని పేర్కొన్నారు.
అంతేకాదండోయ్... ఈ రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయ ఎరువుల సబ్సిడీపైనా ప్రభావం చూనుందని మరో సంక్లిష్టకరమైన వార్త! భారత ఎరువుల సంఘం (ఎఫ్ఏఐ) డైరెక్టర్ జనరల్ అయిన సతీష్ చందర్ ఈ విషయమై.. ‘‘తాజాగా రైలు రవాణా ఛార్జీల పెంపు వల్ల ఎరువుల సబ్సిడీ బిల్లు రూ.200 కోట్లవరకు పెరగవచ్చు’’నని స్పష్టం చేశారు. అయితే రిటైల్ ధరలపై మాత్రం ఎటువంటి ప్రభావం వుండదని వెల్లడించారు. ప్రతి ఏటా 4.4 టన్నుల ఎరువులతోపాటు యూరియా, భాస్వరం, పొటాషియం వంటివి 80 శాతం వరకు రైల్వేల ద్వారా మిగతా రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తున్నారని ఆయన తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more