Motorola Droid Turbo 2: First Shatterproof Smartphone Released

Motorola droid turbo 2 with shatterproof display

Motorola Droid Turbo 2, Motorola, Verizon, shatterproof, Moto ShatterShield, Motorola Droid Turbo 2 Gorilla Glass technology, Motorola Droid Turbo 2 News, Gadget Reviews, Technology News, Tech News, Best Gadgets

The Moto Droid Turbo 2 features a 5.4-inch 2K resolution display, 2GHz octa-core Snapdragon 810 processor, 3GB of RAM, and a 21-megapixel camera

షట్టర్ ప్రూఫ్ డిస్ప్లే తో మోటోరోలా డ్రాయిడ్ టర్బో 2

Posted: 10/31/2015 05:17 PM IST
Motorola droid turbo 2 with shatterproof display

మోటోరోలా అండ్ వెరిజాన్ సంస్థలు సంయుక్తంగా రూపోందించిన నూతన ఉత్పాదన డ్రాయిడ్ టర్బో 2 మోడల్ స్మార్ట్ ఫోన్ ను అగ్రరాజ్యం అమెరికాలో అవిష్కరించింది. గత ఏడాది రూపొందించి విడుదల చేసిన డ్రాయిడ్ టర్బో మోడల్ స్మార్ట్ ఫోన్ ను మరింత అప్ గ్రేడ్ చేసి నూతనంగా డ్రాయిడ్ టర్బో 2 స్మార్ట్ ఫోన్ ను అవిష్కరించింది. వరల్డ్ ఫర్స్ట్ షట్టర్ ప్రూఫ్ డిస్ప్లే తో వస్తున్న ఈ నూతన స్మార్ట్ ఫోన్ ను అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా రూపోందించింది. దీంతో పాటుట అసలు ఫోన్ పగిలేందుకు ఎలాంటి అవకాశం లేకుండా షట్టర్ ప్రూప్ ఏర్పాటు చేయడంతో.. అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ రానేవచ్చింది.

షట్టర్ ప్రూప్ షీల్డ్ ను తయారు చేయటానికి మోటోరోలా సంస్థకు 3 సంవత్సరాలు సమయం పట్టింది. రిజిడ్ అల్యూమినియం కోర్, ఫ్లేక్సిబిల్ అమోలేడ్ డిస్ప్లే, ట్విన్ టచ్ లేయర్స్, కవరింగ్ కొరకు ఇన్నర్ అండ్ ఔటర్ లెన్స్ కూడా ఉన్నాయి. దీంతో షట్టర్ కూడా విరిగే అవకాశాలు తక్కువని చెబుతున్నాయి సంస్థ వర్గాలు. దీనితో పాటు డ్రాయిడ్ మాక్స్ 2, మోటో ఎక్స్ ప్లే రీ బ్రాండ్ చేసిన మోడల్ కూడా లాంచ్ చేసింది అదే ఈవెంట్ లో. మోటోరోలా డ్రాయిండ్ టర్బో 2 యూరోప్ అండ్ ఆసియా లో మోటో x ఫోర్స్ పేరుతో రానుంది

ప్రత్యేకతలు
* 5.4 in డిస్ప్లే
* ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్
* 3gb ర్యామ్
* 21MP డ్యూయల్ led ఫ్లాష్ ప్రైమరీ కెమేరా, 5MP led ఫ్లాష్ కెమేరా.
* 32gb/64gb ఇంబిల్ట్ స్టోరేజ్
* 2TB మైక్రో sd కార్డ్ స్లాట్
* 3760 mah బ్యాటరీ తో 25W చార్జర్ (15 నిముషాలు చార్జింగ్ చేస్తే 13 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తుంది)
* ఆండ్రాయిడ్ 5.1.1 అవుల్ ఆఫ్ ది బాక్స్ ఓ ఎస్, మార్ష్ మల్లో ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ కూడా వస్తుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motorola Droid Turbo 2  Motorola  Verizon  shatterproof  

Other Articles