Ram charan rachha movie creates records in collections

ram charan rachha movie creates records in collections

ram charan rachha movie creates records in collections

14.gif

Posted: 04/09/2012 05:48 PM IST
Ram charan rachha movie creates records in collections

             r1 మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. రచ్చ సినిమా రికార్డు కలెక్షన్లను వసూలు చేసి సినీ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ సాధిస్తోన్న విజయాలపై దర్శక నిర్మాతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇవాళ సక్సెస్ మీట్ లో వారి మాటలు ఇలా ఉన్నాయి. r2
               'రచ్చ' సినిమా ఈ నెల 5న విడుదలవగా, విడుదలైన 3 రోజుల్లోనే రూ. 15 కోట్ల షేర్‌ వచ్చిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీప్రసాద్‌ తెలియజేశారు. మెగా సూపర్‌గుడ్‌ బేనర్‌లో ఎన్నో సినిమాలు తీశాం. ఇంత పెద్ద చిత్రం చేయడం ఇదే మొదటిసారి. మా బేనర్‌లో ఇంతవరకు రాని కలెక్షన్లు ఈ సినిమాతో వచ్చాయి. ఈ విజయం చిరంజీవి అభిమానుల విజయమని చెప్పారు.
                 ఈ చిత్రం ఓపెనింగ్ రోజైన ఈనెల ఐదో తేదీన ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఓపెనింగ్ రోజున ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న 'బిజినెస్‌మేన్', 'ఊసరవెల్లి' రికార్డులు బద్ధలైనట్టు ప్రసాద్ తెలిపారు. "రచ్చ" ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ.8.54 కోట్లుగా ఉన్నాయన్నారు. ఇవి కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చిన వసూళ్ళని చెప్పారు. పక్క రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే "రచ్చ" సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించనుందని చెప్పారు.
              r6 ఏమైంది ఈ వేళ సినిమా చేశాక రామ్‌ చరణ్‌ సినిమాకు ఆఫర్‌ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంపత్ అన్నారు. ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పాను. ఆయన మొదటి నుంచి ఎంతో సహకరించారు. ఆయన అంగీకరించకపోతే ఈ సినిమానే లేదని దర్శకుడు సంపత్‌నంది చెప్పారు.
              సంపత్ మాట్లాడుతూ... నేను ఏదో పెద్ద కళాఖండం తీయలేదు. కమర్షియల్‌ సినిమా తీశానని చెప్పగలను. మొదట్లో ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో టాపిక్‌లు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు కూడా కామెంట్లు వచ్చాయి. రిలీజ్‌ తర్వాత రచ్చ సత్తా ఏమిటో చూపించింది. అద్భుతమైన హిట్‌ ఇచ్చారు ప్రేక్షకులు అని చెప్పారు. అనధికార లెక్కల ప్రకారం రచ్చ తొలిరోజే 8.5 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards
Film actress sara sharma opens a optical showroom in hyadeabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles