Endukante premanta logo relese today

endukante premanta logo relese today

endukante premanta logo relese today

16.gif

Posted: 04/09/2012 08:04 PM IST
Endukante premanta logo relese today

             inn_1 చిత్రసీమలో ‘ఎందుకంటే ప్రేమంట’ మానియా మొదలైంది.  తమన్నా - రామ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కొంచెం సేపటిక్రితం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమౌళి చేతులమీదుగా ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. tamanna_2222
              స్రవంతీ రవికిషోర్ మంచి అభిరుచిగల నిర్మాత అనీ ... అలానే ప్రేమ కథా చిత్రాలను హృద్యంగా తెరకెక్కించడంలో కరుణాకరన్ కి ఓ ప్రత్యేకత వుందని ఈ సందర్భంగా రాజమౌళి అన్నారు. తమన్నా- రామ్ ఇద్దరూ కూడా సక్సెస్ బాటలోనే ఉన్నారనీ, ఈ లోగో పై వాళ్ల జంట చూడ ముచ్చటగా వుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
           ఈ వేడుకలో హీరోహీరోయిన్లతో పాటు కరుణాకరన్, స్రవంతి రవికిషోర్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియో ఈ నెల 21 న,  సినిమా మే 11 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మీద కరుణాకరన్ చాలా నమ్మకంగా ఉన్నారని సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్రవర్గాలు అంటున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja dharuvu shooting complete
Taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles