Star director rajamouli eega movie will release on

star director rajamouli eega movie will release on

star director rajamouli eega movie will release on

27.gif

Posted: 04/23/2012 06:23 PM IST
Star director rajamouli eega movie will release on

              eega_inn1 స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన గ్రాఫిక్స్ అద్భుతం 'ఈగ' మే 30వ తేదీన ప్రజలపై వాలేందుకు సిద్దమౌతోంది. మే 30న 'ఈగ'ను విడుదల చేస్తోన్న విషయాన్ని ఆఫీషియల్ గా ప్రకటించారు.  నాని, సమంత, సుదీప్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. కాగా, ఈ అద్భుత గ్రాఫిక్స్ థ్రిల్లర్ కు మొత్తం బడ్జెట్ ముప్పై రెండు కోట్ల వరకూ అయిందని చెప్తున్నారు. గ్రాఫిక్స్ కోసమే ఐదు కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు.                 

            rajaఇదిలా ఉండగా,  ఈగ స్టోరీలైన్ కూడా అంతే ఆసక్తికగిస్తోంది. రాజమౌళి ఈ సినిమా విశేషాలు గురించి ఇలా తెలిపాడు.  'చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే. 'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ..' అని చెప్పాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan new movie gabbar singh do great business before release
Bollywood beauty karina kapoor acts as jejamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles