తెలుగు చిత్ర సీమలో పవర్ స్టార్ స్టామినా సామాన్య మైనది కాదు. ఎన్ని చిత్రాలు అపజయం పాలైనా కాని.. అతని ఇమేజ్ యూత్ లో సుస్థిరం. ఈ మధ్య సరైన హిట్ ఏమీ లేకపోయినప్పటికీ, ఏ సినిమాకాసినిమా బిజినెస్ పరంగా హాట్ కేక్ లానే కొనసాగుతుంది. ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతున్న 'గబ్బర్ సింగ్' కూడా బయ్యర్లకు అలానే కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి, కేవలం థియేటర్ హక్కుల నుంచే నిర్మాతకు 32 కోట్ల వరకు వచ్చిందట. శాటిలైట్ రైట్స్ వంటివి కలుపుకుంటే నలభై కోట్ల వ్యాపారం చేసిందని బిజినెస్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ పారితోషికం తీసుకోలేదనీ, లాభాల్లో 50 శాతం వాటాను తన పారితోషికంగా వుంచుకున్నారనీ అంటున్నారు. ఆ విధంగా ఆయన పారితోషికం మినహాయించి చూస్తే, మొత్తం సినిమాకు ఖర్చు 18 నుంచి 20 కోట్ల వరకు అయ్యుంటుందని అంచనా. ఆ ప్రకారం బిజినెస్ జరగడాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇప్పటికే పవన్ వాటాగా 10 కోట్లు వచ్చేసిందని చెబుతున్నారు. ఒకవేళ రేపు సినిమా పెద్ద హిట్టయితే, మరింత డబ్బు పవన్ ఖాతాలోకి వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విజయం మీద చిత్ర సీమలో అందరికీ ధీమా కనిపిస్తోంది. విడుదలయ్యాక సైతం అందరి నమ్మకాలను నిలబెట్టాలని ఆశిద్దాం.
....avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more