Rajamouli eega creates sensation

rajamouli eega creates sensation

rajamouli eega creates sensation

1.1.gif

Posted: 06/22/2012 01:02 PM IST
Rajamouli eega creates sensation


     రాజమౌళి ఈగ సంచలనాలకు వేదిక అవుతుందా అంటే.. సర్వత్రా అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు ఇటీవల కొన్ని దఫాలుగా రాజమౌళి ఈగ మూవీ ఎందుకు రిలీజ్ చేసేందుకు ఆలస్యమవుతుందో వెల్లడిస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ లు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇవాళ రాజమౌళి మరో నివేదికను విడుదల చేశారు. ఇందులో రాజమౌళి అభినయం చూసి అంతా ముగ్ధులవుతున్నారు. అంతేకాదు ఈగకు డబ్బింగ్ చెప్పి రాజమౌళి చిత్రానికి ఇంకా హైప్ క్రియేట్ చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే.. మామూలుగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి పెద్ద హీరోల సినిమాలను అత్యధిక దియేటర్లలో విడుదల చేస్తుంటారు. రేపు సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఓపెనింగ్ కలక్షన్లను రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇలా నెంబరాఫ్ దియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఎటువంటి స్టార్లూ లేని 'ఈగ' సినిమా ఒక్కసారిగా వందలాది దియేటర్లలో విడుదలవుతూ సంచలనం సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 6 న తెలుగు ... తమిళ ... మలయాళ భాషల్లో ఒకేసారి 1200 ల ప్రింట్లతో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి అందించిన తాజా ప్రోగ్రెస్ పై విధంగా ఉంది..1

      కాగా,  ఈ చిత్రంలో ఈగ పాత్రకి దర్శకుడు రాజమౌళి గాత్రదానం చేయటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. హీరో నాని మరణించి, ఈగ గా జన్మించి, విలన్ పై కక్ష తీర్చుకునే కథాంశంతో ఇది రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. దాంతో, ఇన్నాళ్లూ ఈ 'ఈగ' పాత్రకు హీరో నాని డబ్బింగ్ చెబుతాడని అంతా అనుకున్నారు. అయితే, కొత్తదనం కోసం రాజమౌళి డబ్బింగ్ చెబుతున్నాడట. ఈగ తెలుగులో మాట్లాడడమే ఆసక్తికరం, విశేషం అనుకుంటే.... అందులోనూ రాజమౌళి వాయిస్ తో అది మాట్లాడడం మరో విశేషం అవుతుంది.
      అంతేకాదు.. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయట. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును సృష్టించిందని చిత్ర నిర్మాతలు మీడియాకు ప్రెస్ నోట్ వదిలారు. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డుల్ని ఈ సినిమా ట్రైలర్ వెనక్కు నెట్టేసిందట. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్' ట్రైలర్ నెల రోజులకు 4,68,000, 'రచ్చ' ట్రైలర్ మూడు వారాలకు 5,03,000, 'దమ్ము' సినిమా ట్రైలర్ 8 రోజులకు 3,28,000 క్లిక్స్ సాధించగా, 'ఈగ' సినిమా ట్రైలర్ కేవలం 7 రోజుల్లో 5,63,000 క్లిక్స్ సాధించి, కొత్త రికార్డును కొట్టిందని చిత్రం వర్గాలు చెబుతున్నాయి. ఇలా యూ ట్యూబ్ ని తమ ట్రైలర్ షేక్ చేయడం పట్ల దర్శక నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి, రేపు సినిమా విడుదలయ్యాక మరెన్ని రికార్డులు కొడుతుందో! 
     2మరో థ్రిల్ ఏంటంటే.  తమిళ సినిమా రంగంతో పరిచయమున్న వారికి క్రేజీ మోహన్ సుపరిచితుడే. 62 సంవత్సరాల మోహన్ (అసలు పేరు మోహన్ రంగాచారి... ఆయన నాటక సంస్థ పేరు 'క్రేజీ ట్రూప్' కావడంతో ఆయన పేరు క్రేజీ మోహన్ గా స్థిరపడింది) పలు సినిమాలకు డైలాగులు రాసినా, సునిశిత హాస్య రచనకు ఆయన పెట్టింది పేరు. అందుకే రజనీకాంత్ వంటి తారల సినిమాలకు ఆయన పనిచేసినప్పటికీ, కమలహాసన్ చిత్రాల ద్వారానే ఆయన ఎక్కువగా పాప్యులర్ అయ్యారు.  ఇప్పుడీయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం తమిళ వెర్షన్ కి ఆయన రచన చేయడమే కాకుండా, అందులో ఓ పాత్ర కూడా పోషించారాయన. సినిమాలో తన పాత్ర చాలా కీలకమైనదని క్రేజీ మోహన్ చెబుతున్నారు. 'ఈగ తమిళ వెర్షన్ కి రాజమౌళి మాటలు రాయమన్నారు. కొన్ని రాసి చూపించాను. ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత కంటిన్యు అయ్యాను' అన్నారు క్రేజీ మోహన్. ఈ చిత్రంలో పెద్ద పెద్ద డైలాగులు కాకుండా తక్కువ మాటలతో కూడిన సంభాషణలు ఉంటాయని ఆయన అన్నారు. crazy-mohan_8724
      సమంతా ... నాని ... సుదీప్ ... ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాలో  గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేశారు. దాంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథగా ముస్తాబయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే కథ అందరికీ చెప్పేసినా, ఆసక్తికరమైన కథనం ... దానిని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని చెబుతున్నారు. ప్రతి ఫ్రేమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాజమౌళీ, ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా వున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాలను అందిస్తూ వచ్చింది. అలాగే ఈ ప్రయోగం ద్వారా ఆయన అనుకున్న ప్రయోజనం కూడా నెరవేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil hero karti sekuni movie review
Sakuni movie release tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles