Sakuni movie release tomarrow

sakuni movie release tomarrow

sakuni movie release tomarrow

17...gif

Posted: 06/21/2012 08:00 PM IST
Sakuni movie release tomarrow

     అటు తమిళనాట, తెలుగునోట సుపరిచితమైన హీరోలు సూర్య  ... కార్తి అన్నదమ్ములనే సంగతి తెలిసిందే. తమిళ్లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతోన్న వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'గజిని'... 'ఆరు' వంటి అనువాదాలతో సూర్య తెలుగు3.1f ప్రేక్షకులకి చేరువయ్యారు. ఇక 'నా పేరు శివ' ... 'ఆవారా' వంటి చిత్రాల ద్వారా ఇక్కడ క్రేజ్ ని కొట్టేశాడు కార్తి. కెరియర్ ప్రారంభం నుంచి కూడా ఈ అన్నదమ్ములిద్దరూ తెలుగుపై తెలివిగా దృష్టి పెట్టారు. ఒకరి తరువాత ఒకరు తమ చిత్రాలను ఇక్కడకి దిగుమతి చేస్తూ, తమ మార్కెట్ ని విస్తృతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తి నటించిన 'శకుని' చిత్రం ఈ నెల 22 న భారీ స్థాయిలో విడుదలౌతోంది. ఈ సినిమాపై కార్తి పెంచుకున్న ఆశల సంగతి అటుంచితే, చాలా తక్కువ గ్యాప్ లోనే సూర్య సినిమా కూడా ఇక్కడ సందడి చేయనుంది. తమిళ్లో 'మాట్రాన్' గా తెరకెక్కుతోన్న ఈ సినిమా, తెలుగులో 'డూప్లికేట్' పేరుతో విడుదల కానుంది. 'శకుని' చిత్రంలో కార్తి రాజకీయనాయకుడిగా విభిన్నమైన పాత్రలో అలరిస్తుంటే, 'మాట్రాన్' లో నాయకుడిగా ... ప్రతి నాయకుడిగా సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వీళ్లిద్దరూ తమ అనువాద చిత్రాలకు ఇక్కడ ఆడియో ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవడం మరింత విశేషంగా చెప్పుకోవాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega creates sensation
Actress nayana tara facing trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles