Dasari narayana rao comments about films

dasari narayana rao comments about films

dasari narayana rao comments about films

17.gif

Posted: 07/02/2012 06:35 PM IST
Dasari narayana rao comments about films

       దర్శక రత్న రూటే.. సపరేటు.. ఆయన ఏ ఫంక్షన్లో దర్శనమిచ్చినా తన వాగ్ధాటికి ఎవరోకరు బలవ్వాల్సిందే. ఇంకోరకంగా చెప్పాలంటే, నిర్మోహమాటంగా తన మనసులో మాట చెప్పగల ధైర్యం దాసరి సొంతం. తన సుధీర్ఘ చలన చిత్ర రంగ అనుభవం ద్రుష్ట్యా, పరిశ్రమకు మేలు చేస్తుందన్న ఏదో సూచనను ఆయన చేసేస్తారు. ఇందుకు కొందరు నొసలు చిట్లించినా పట్టించుకోరు. ‘ఈరోజుల్లో’ సినిమా శత దినోత్సవ 2eవేడుకల్లో ఆయన మరో హాట్ కామెంట్ చేశారు. ఇక మీదట ఎవరన్నా ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా అంటే నరికేస్తానన్నారు. అంతేకాదు  గత ఆరేళ్ల కాలంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో తనకు మూడే మూడు సినిమాలు నచ్చాయని చెప్పారు. ఆ మూడు సినిమాలు ఏమిటంటే 'బొమ్మరిల్లు', 'అలా మొదలైంది', 'ఈ రోజుల్లో' అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు ఆదరించిన ప్రతీ సినిమా పెద్ద సినిమానే. ఇందులో కథ లేదు. కానీ, ప్రస్తుతం మన కళ్ళెదురుగా జరుగుతున్నవన్నీ ఇందులో వున్నాయి. ఈ సినిమా చూసిన మొదటి రోజే చెప్పాను, ఇది వంద రోజుల సినిమా అని. అది నిజమైంది" అన్నారు దాసరి. మొత్తానికి ఇలా కుండబద్ధలు కొట్టారు దాసరి నారాయణరావు.
       అనుభవజ్ణులు కూడా నోరు మెదపకుండా మౌనం వహిస్తే యువతరానికి సూచనలు సలహాలు హెచ్చరికలు ఎలా అందుతాయిమరి.. కేరీఆన్... దాసరి గారూ.....

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranbir kapoor priyanka chopra iliyana latest movie trailer
Sudhir babu for aggipulla movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles