Jr ntr sukumar movie confirmed

Jr.ntr-sukumar movie, ntr and sukumar movie confirmed, ntr to act in sukumar, Young tiger and Sukumar movie

BVSN Prasad will venture this project and will hit the floors from April 2014. Sukumar will start its script work after the release of Mahesh Babu Starrer 1-Nenokkadine.

సుక్కుతో ఎన్టీఆర్ సినిమా ఖరారు అయ్యింది

Posted: 12/27/2013 09:55 AM IST
Jr ntr sukumar movie confirmed

టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ ఇటీవలి కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడో, లేక ఈయన ట్రాక్ రికార్డును చూసి స్టార్ హీరోలే ఈయన దర్శకత్వంలో ఆసక్తి చూపిస్తున్నారో కానీ గత కొంత కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్ ఆయన దర్శకత్వంలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఎట్టకేలకు ఇప్పుడు ఆ కాంబినేషన్ ఓకే అయిందని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస ’ చిత్రం చేస్తున్నాడు. మొన్నటి వరకు ఓ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి కమీట్ అయ్యే ఎన్టీఆర్ ఇప్పటి వరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ కమీట్ కాలేదు. తాజాగా సుకుమార్ కాంబినేషన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

చాలా రోజుల నుండి ఈ చిత్రం ఉంటుందని వార్తలు వస్తున్నా ఇన్ని రోజులకు ఓ అయింది. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్తున్నట్టు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ప్రకటించాడు. ఓ వైపు నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న చిత్రాలు చేయాలని అనుకున్న సుకుమార్ బాలీవుడ్ కి వెళ్లాలని అనుకున్నాడు. కానీ జూనియర్ తో చిత్రం తరువాత బాలీవుడ్ గురించి ఆలోచన చేస్తాడని అంటున్నారు.

ఎన్టీఆర్ సరసన కొత్త అమ్మాయిని తీసుకోవాలని, అందుకోసం వేట ప్రారంభినట్లు చెబుతున్నారు. మరి మాస్టారి గారి దర్శకత్వంలో బుడ్డోడి సినిమా అంటే ఆ క్రేజే వేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles