శివశేన అధినేత బాల్ థాకరే, రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలేమీ కనిపించటం లేదని, అతను ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేడని అన్నారు. ఆయన ప్రధాన మంత్రి కాలేడేమోనని ఒకవేళ మనస్తాపం చెందితే గనక రాహుల్ తల్లి సోనియాగాంధీకి ఉండాలి కానీ బాల్ థాకరే కి ఎందుకా బాధ అనుకుంటే, అదే మరి రాజకీయం. వార్తలను మసాలా దట్టించి పాఠకులు వాటిని ఆసక్తిగా చదివేట్టుగా చెయ్యాలంటే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుండాలి. నాయకులను ప్రజలు మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడూ ఇలా వ్యాఖ్యానిస్తుండాలని సీనియర్ నాయకుల మాటలతో అర్థమౌతుంది.
చనిపోయినవాళ్ళని ఎంత పొగిడినా పరవాలేదు. వాళ్ళు పోటీకి వచ్చే స్థితిలో లేరు, తన మాటల వలన వాళ్ళకెలాంటి ప్రయోజనం కలుగదు కనుక ధైర్యంగా పొగడచ్చు. గాంధీ, నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ లను గుర్తు చేసుకుంటూ, బాల్ థాకరే ఆ కాలంలోనే కానీ ప్రస్తుతం నాయకత్వ లక్షణాలు కనిపించటం లేదని అన్నారు. ఇందిరా గాంధీని ఆ కోవలోకి చేర్చినా ఆ క్రెడిట్ రాహుల్ కి దక్కే అవకాశం ఉంది కాబట్టి ఆమె పేరు వాడలేదు.
ఏ నాయకుడైనా తనేమి చేసాడు, ఇక ముందు ఏమి చెయ్యగలడన్నది చెప్పాలి కానీ ఇతరులను తనకంటే చిన్నగా చేస్తే అది తన గురించి చెప్పినట్టు కాదు గదా. సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించి చూసి, అందరూ చేతగాని నాయకులే కాబట్టి వారందరికంటే తను చాలా గొప్పవాడని అనుకోవాలనా. కాదు అంతకంటే మరో మంచి కారణముంది.
ఎదుటివారిని డిఫెంస్ లో పడేయటం. ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ పోతుంటే, అందులోంచి బయటపడటానికే ఎదుటి వాళ్ళు గిలగిల్లాడి పోవాలి. వాళ్ళ సమయమంతా అందులోనే పోతుంది. ఇక ఎత్తుకి పై ఎత్తు వెయ్యటానికి అవకాశం ఉండదు. ఒక వేళ జవాబేమీ చెప్పకపోతే, ఆ మౌనాన్ని అర్ధాంగీకారం కాదు ఏకంగా సంపూర్ణాంగీకారంగానే భావించేస్తారు. అందువలన తప్పనిసరిగా జవాబులివ్వాల్సివుంటుంది. అలా మాటామాటా పెంచి రాద్ధాంతం చెయ్యవచ్చు.
ఆ మధ్య లండన్ లో జరిగిన ఘాతుకంలో టైం ఎంతైందని అడిగి జవాబు చెప్పకపోతే గన్ తో కాల్చి చంపారో భారతీయ విద్యార్థిని. ఈ వ్యాఖ్యానాలు కూడా అలాంటివే. .విభేదాల వేడి ఎప్పటికీ చల్లారకుండా రాజుకుంటూ వుంటుంది.
రాజకీయాలంటే అంత సులభంగా వంటబట్టేవి కావు. చాలా ఉన్నాయి నేర్చుకోవటానికి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more