ఎప్పటికైనా ధర్మానిదే అంతిమ విజయం మా వద్ద డబ్బేలేదు.. మేము డబ్బులు పంచలేము? ఇక పంపిణీ ఎలా జరుగుతుంది? ఈ మాటలు అన్నది ఎవరు కాదు .. స్వయాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు ఇప్పుడు గీతోపాదేశం చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పే వేదాంతం వెనుక కూడా నిజం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చంద్రబాబు .. ఆర్థికంగా దెబ్బతిన్న విషయం బయటకు చెప్పటం చాలా విశేషం. ప్రతిపక్షంలో.. ఉండి ప్రతి ఉప ఎన్నికల్లో ను ఎదుర్కొకోవాలంటే.. ఎవరికైన కష్టమే. ఇప్పుడున్న కాలంలో పార్టీకి ఫండ్ ఇచ్చే వారు లేరు. అయిన చంద్రబాబు ఇన్ని రోజు తమ పార్టీ నెట్టురావటం.. చాలా కష్టమైన పనే. ఆర్థికంగా దెబ్బతిని.. అధికారం కోసం బాబు పడుతున్న పాట్లు చూస్తుంటే ..చాలా బాధగా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
చంద్రబాబు తెలివితో .. పార్టీ ఫండ్ సంపాదించి.. ఉప ఎన్నికలలో నిలబడితే.. డిపాజిట్ కూడా రావటం లేదని చంద్రబాబు వాపోతున్నాడు. ఇలాంటి దెబ్బలతో పార్టీకి ఫండ్ ఇవ్వాలనే వారు ముందుకు రావటం లేదని .. బాబు అంటున్నారు. బాబు ఏదో మొండిధైర్యంతో పార్టీని నడిస్తున్నాడు. ఏదో ఒక రోజు మళ్లీ సీఎంను కాకపోతాన అనే ఆశ ఆయనను ముందుకు నడిపిస్తుందని .. ఆ పార్టీ నాయుకులు అంటున్నారు. వరుస ఓటములతో బాబు విరక్తి పుట్టిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, డిపాజిట్లు కోల్పోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వేదంలో పడ్డారు. ఉప ఎన్నికలు ఎవడి కోసం వస్తున్నాయో అర్థం కావడంలేదని, వాటివల్ల ప్రయోజనం ఏమీ లేనపుడు పోటీ చేయకుండా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న శక్తులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఎప్పటికైనా ధర్మానిదే అంతిమ విజయమని, అధర్మం జయించదని పేర్కొన్నారు. తమ దగ్గర డబ్బులే లేనపుడు వాటిని పంపిణీ చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ‘అవినీతికి పాల్పడ్డవారి వల్ల ఎన్నికల మీద ఎన్నికలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. 2009 ఎన్నికల తర్వాత మళ్లీ 11 స్థానాల్లో ఉపఎన్నికలు. ఆ తర్వాత కడప - పులివెందుల ఉపఎన్నికలు, వెంటనే బాన్సువాడలో. త్వరలో 18 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలు. ఎవడి కోసం ఇవి? ఒక్కోసారి ఎందుకీ ఉప ఎన్నికలు అనిపిస్తోంది. అందుకే తమిళనాడులోలాగా పోటీ చేయకుండా వదిలేద్దాం అనిపిస్తోంది. అలా విడిచిపెడితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వారికి, పనికిమాలిన దుష్టశక్తులకు లెసైన్సు ఇచ్చినట్టుందని బరిలోకి దిగుతున్నాం. తొమ్మిదేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఇన్ని ఉప ఎన్నికలు ఎదుర్కోవడం కష్టం’ అని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు టీవీ ఛానళ్లు, పేపర్లు పెట్టి 24 గంటలూ కొన్ని అంశాలను చూపుతూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయని, వారి త్యాగాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 2014లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. తమ పార్టీ ఒక ఫ్యాక్టరీ వంటిదని, కాంగ్రెస్, పీఆర్పీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల్లోనూ తమ పార్టీ వారే ఉన్నారన్నారు. గతంలో హామీ ఇచ్చినట్లే టీడీపీలో యువతకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఎన్ని పార్టీల రంగు వెలిసిపోయినా తమ పార్టీ పచ్చరంగు ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. టీడీపీ సంక్షోభంలో ఉందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సంక్షోభాలు మాకు కొత్తకాదు. ఎన్టీఆర్‌ను సీఎంగా దించేయాలని ఇందిరాగాంధీ ప్రయత్నించి ఓడిపోయారు. పార్టీని కాపాడుకునేందుకు నేను చేసిన పనినీ విమర్శించారు. వైఎస్సార్ సైతం మా పార్టీని చీల్చాలని చూశారు’ అని చెప్పారు. రెడ్డి కాంగ్రెస్, మర్రిచెన్నారెడ్డి, ఎన్జీ రంగా, వంటి పార్టీలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కావాలని భావించినప్పటికీ నిలబడలేకపోయాయని ఇప్పటికీ కొన్ని పార్టీలు ఆ పనిలో ఉన్నాయని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more