ఏ విషయానైన రగడ చేయటంలో లగడపాటి ప్రముఖ మేథావి అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ కు ఖచ్చితమైన నిజం చెప్పిన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి ఒక్కేడేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా విమర్శించి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ప్రత్యక్షంగా విమర్శలు చేయటం జరిగింది. రాష్ట్రం విడిపోతే ఏమవుతుందని అన్నవారు కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకుంటే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అంటున్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోగా, అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన చెబుతున్నారు. పొత్తూరి వెంకటేశ్వర రావు వంటి మేధావులు కూడా కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. దేశం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతోనే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నట్లు లగడపాటి చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తుంటే కలిసి ఉన్నప్పుడే అడ్డుకుంటుంటే రాష్టం విడిపోతే ఏమవుతుందో ఊహించలేరా అని ఆయన అడిగారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని సంకేతాలు అందినట్లు కెసిఆర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని రాజగోపాల్ చెబుతున్నారు. దొంగ మాటలతో ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని లగడపాటి అంటున్నారు .
తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయని తెరాస ఐదేళ్ల పాటు తెలంగాణ రాదని అంగీకరించినట్లేనా, తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనా అని లగడపాటి కేసిఆర్ కు చురకలు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని, పార్టీలకు అతీతంగా నాయకుల పర్యటనకు భద్రత కల్పిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారని లగడపాటి చెబుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు, వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు ఆటంకాలు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు చేశారని రాజగోపాల్ మీడయా ముందు చెప్పటం విశేషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా ఉంటారని, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదని కెసిఆర్ అంగీకరించినట్లే కదా అని కేసిఆర్ లగడపాటి రగడ చేయటం తో కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని .. మీడియా వర్గాలు అనుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more