గడిచిన 8 నెలల నుండి రాష్ట్రం కాస్త ప్రశాంతంగా ఉంది. ఉద్యమాలు , బంద్ లు, కొంచెం తగ్గు ముఖం పట్టాయి. కానీ ఇలాంటి సమయంలో.. మళ్లీ తెరమీద ఒక పెను ఉద్యమ తుపాన్ రాబోతుందని.. కొంతమంది నాయకులు చెబుతున్నారు. గతంలో చేసిన ఉద్యమా గాయాలు ఇంక ట్యాంక్ బండపై మానలేదు. మళ్లీ రెండోసారి అంటే.. ఈసారి ఎలా ఉంటోందని .. రాష్ట్ర ప్రజలు , భయపడుతున్నారు. కొంతకాలం క్రితం హైదరాబాద్ మార్చ్ పేరిట తెలంగాణవాదులు తీసిన ర్యాలీ ఉద్రిక్తంగా మారి, టాంక్ బండ్ పై ఉన్న విగ్రహాల విధ్వంసానికి దారి తీసింది.ఈసారి తెలంగాణ మార్చ్ పేరిట సన్నద్దమవుతున్నారు. ప్రభుత్వానికి ఇది ఒక సవాల్ అయితే, హైదరాబాద్ కు అంతకన్నా పెద్ద పరీక్షగా భావించాలి.తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్న సమయంలో ఈ మార్చ్ ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేం.
అయితే ఈ లోగానే తెలంగాణపై ఒక పరిష్కారం దొరుకుతుందా అన్నది అనుమానంగానే ఉంది. అయితే టిఆర్ఎస్ ఇంకా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించలేదు. కాని టిడిపి తెలంగాణ పోరం, సిపిఐ వంటి పక్షాలు మద్దతు ఇస్తున్నాయి. తెలంగాణపై తేల్చకపోతే టిఆర్ఎస్ కూడా పాల్గొనవచ్చు. కాగా ఈనెల 30న తెలంగాణ మార్చ్ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.
తెలంగాణ మార్చ్‌కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొంటామని, ప్రభుత్వం దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ముందు సన్నాహక ర్యాలీలను కోదండరామ్ ఆరంభించారు. అంటే మెల్లగా తెలంగాణ మార్చ్ కు వేడి పుట్టించడమే వీరి లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ముందుగా ప్రభుత్వం అప్రమత్తం అయితే ఈ పరీక్షకు అడ్డుకట్ట వేయాగలదని .. హైదరాబాద్ ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more