‘‘నందామయా గురుడు నందామయా.. బ్రహ్మచారి రాహుల్ గాంధీ తత్వం గురించి తెలుసుకుందామయా’’. ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు.. అలాగే పెళ్లిపై మోజు లేదని కాంగ్రెస్ పార్టీ యువత నేత చెప్పటం వెనక ఉన్న అర్థం ఏమిటో కాంగ్రెస్ నాయకులకు అర్థం కావటంలేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానని చెబుతున్నారు. అధిష్టానం సంస్క్యతికి చరమ గీతం పాడతానన్నారు. కొద్ది మంది చేతుల్లో అధికారం కేంద్రీక్రుతం కాకుండా అందరికీ అధికారం కల్పిస్తానన్నారు. ప్రస్తుతం పార్టీ పటిష్టత పైనే ద్రుష్టి కేంద్రీకరిస్తున్నట్లు వివరించారు. పెళ్లి కూడా ఇప్పుడు వద్దని నిర్మొహమాటంగా చెప్పారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. వారు నా స్థానం కోసం ఆరాటపడతారు అని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీయే ఆదర్శమని, భగవద్గీతలో చెప్పిన ‘నిష్కామకర్మ’ను విశ్వసిస్తానని రాహుల్ చెబుతున్నారు. మహాత్ముడు నా గురువు. పదవుల వెంట పరుగులు తీయని వ్యక్తి ఆయన అని రాహుల్ గాంధీ చెబుతున్నారు. వివాహమనేది ఎవరికి వారు తీసుకునే వ్యక్తిగత నిర్ణయం అని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. పెళ్లి గురించి ఇప్పటికిప్పడు తనేం ఆలోచించడం లేదని ఆయన అన్నారు. నేను పెళ్లి చేసుకుని, నాకు పిల్లలు పుడితే నేను సంసారంలో కూరుకుపోతాను. నా పిల్లలు కూడా ఏదోక నాటిని నా స్థానంలోకి వస్తారు. నాలాగే వారసులవుతారు అని రాహుల్ అంటున్నారు.
ప్రదాన మంత్రి పదవి వద్దంటే దానికి అర్థం ఉంటుంది. అంటే రాజకీయ అనుభవం, వయసు, లాంటి పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. కానీ పెళ్లి వద్దు? ఇప్పుడే ఆ ఆలోచన లేద, ఇంక పెళ్లి వయస్సు రాలేదు? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని రాహుల్ గాంధీ మాట్లాడటంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఏమన్నా 16 వయసులో ఉన్న కుర్రవాడా? పెళ్లి వయసు రాలేదు అని చెప్పటానికి .. ఇప్పుడు రాహుల్ వయసు నాలుగు పదులు దాటిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 20 లో చేసుకోవాల్సి పెళ్లిని .. 40లో అడిగితే.. ఇలాంటి సమాధానాలు చెబుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు అనే విషయం కాంగ్రెస్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు. సంసారం చేస్తే పిల్లలు పుట్టక .. రాళ్లు పుడతాయా అని కాంగ్రెస్ కార్యలయల్లో పార్టీ కార్యకర్తలు జోకులు చెప్పుకొని నవ్వుకుంటున్నారు. అసలు రాహుల్ పెళ్లంటే ఎందుకు భయపడుతున్నాడు? పదవి అంటే ఎందుకు వద్దంటున్నాడు అని అంటే.. రాహుల్ తత్వవేదం బాగా ముదిరిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాటు మాటుగా అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా అబ్దుల్ కలాం, వాజ్ పేయి, మోడీ లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకోని పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కహానీ మాటలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more