సెంటిమెంట్ ఆయింట్ మెంట్ మాదిరిగా పనిచేస్తుందని కొందరు విమర్శకులు చమత్కరించటం సహజమే. చాలామందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి వాటిని ఫాలో కావటానికే ఎక్కువగా అంతా ఆసక్తి చూపిస్తారు. హీరో ఆర్యకూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఈ తమిళ హీరోకు మిల్కీబ్యూటి అంటే సెంటిమెంట్ అట. అంటే ఆమె ఎదురు రావటమో.. ఇంకేదో చేయటమో కాదు. తమన్నాతో సినిమా తీస్తే అది హిట్ అవుతుంది..., ఎంత డబ్బు పెట్టినా తిరిగి వస్తుందని నమ్ముతున్నాడు.
అందుకేనేమో.., తమన్నాతో కొత్తగా సినిమా తీస్తున్నాడు. ఈ ప్రాజెక్టు నవంబర్ 10నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఓకేఓకే ఫేం రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తమిళ సూపర్ కమెడియన్ సంతానం కీలక రోల్ పోషిస్తున్నాడు. ఇక్కడో విషయం ఏమిటంటే ఈ మూవీ ‘బాస్ ఎంగిర భాస్కరన్’ అనే మూవీకి సీక్వెల్ అని అనుకున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, ఫ్రెష్ స్టోరీ అని మూవీ యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా ఇదో కామెడి ఎంటర్ టైనర్ సినిమా అని చెప్తున్నారు.
తమన్నాపై నమ్మకంతోనే ఆర్య స్వయంగా నిర్మాతగా మారి డబ్బులు ఖర్చుపెడుతున్నాడు. మరి ఆర్యుడి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా... లేక తలనొప్పిగా మారుతుందా అనేది త్వరలో తెలియనుంది. ‘వరుడు’ సినిమాలో విలన్ గా తెలుగులో పాపులర్ అయిన ఆర్య ఆ తర్వాత నటించిన ఆరంభం, వర్ణ సినిమాలు మరింత ప్రజాదరణను తీసుకొచ్చాయి. దీనికి తోడు తమన్నాకు తెలుగు, తమిళ ప్రజల్లో క్రేజ్ ఉండటతో అమ్మడితో సినిమా అంటే ఫ్రీ పబ్లిసిటీ ఆ తర్వాత కలెక్షన్లు కూడా బాగానే ఉంటాయని భావించి స్థాయికి మించి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించాడని అంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more