సాధారణంగా చిత్రపరిశ్రమలో అగ్రతారలుగా పేరొందిన వారందరూ సినిమాలతోపాటు ఏదో ఒక కంపెనీకిగానీ, ఉత్పత్తికిగానీ, ఇతర ప్రొడక్ట్స్ కు ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా కొనసాగుతుంటారు. వీటితోపాటు నగలు, చీరల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లకు కూడా హాజరవుతారు. ఇలా చేయడం వల్ల వారికి కొంత వ్యయం రావడంతోపాటు కాస్త అభిమానుల క్రేజ్ కూడా కలిసొస్తుంది. ఫలితంగా వాళ్లకు అన్నీవిధాల ‘ప్లస్’ పాయింట్లే వస్తాయి. కానీ మూడుపదుల సెక్సీ భామ నయనతార మాత్రం ఇటువంటి వ్యవహారాలకు దూరంగానే వుంటానని పేర్కొంటోంది. షాపింగ్ ఓపెనింగ్స్ కి వెళితే వీపు విమానమైపోద్దంటూ ఈమె తన అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది.
నిజానికి నయన తానెప్పుడో మొదట్లో కాస్త పేరున్న తారగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారి చీరల దుకాణానికి ప్రచారకర్తగా వ్యవహరించింది. ఆ తర్వాత ఆమె ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గానీ... షాప్ ఓపెనింగ్స్ కి కానీ వెళ్లిన దాఖలాలే లేవు. వరుసగా సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకంటూపోతోంది. ప్రచారకర్తగా తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా... వాటికి తిరస్కరించి ఇంట్లోనే హాయిగా రిలాక్స్ అయిపోతోంది. ‘‘అదేంటీ..? ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకుంటే మంచి ఆదాయంతోపాటు క్రేజ్ కూడా లభిస్తుంది కదా..?’’ అంటూ ఆమెను ఇంటర్య్వూలో ప్రశ్నించగా.. అందుకు తాను తనదైన రీతిలో సమాధానమిచ్చింది.
ఈ వ్యవహారంలోనే నయన మాట్లాడుతూ.. ‘‘మేము షాప్ ఓపెనింగ్స్ ఒప్పుకున్నామనుకోండి... అక్కడికెళ్లిన తర్వాత తీరిగ్గా పూజా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఆ తర్వాత నాలుగైదు రకాల చీరలిచ్చి.. ఒకదాని తర్వాత ఒకటి మార్చుకోమంటారు. ఆ చీరల్లో మేం ఫొటోలకు పోజులివ్వాలి. ఇక.. ఫలానా కార్యక్రమానికి సెలబ్రిటీలు వస్తున్నారని ముందే ప్రకటిస్తారు కాబట్టి, విపరీతమైన జనాలు అక్కడికి వాలిపోతారు. దాంతో ఆ హడావుడిల మధ్య ఏం జరుగుతుందోనని ఒకటే టెన్షన్. అందుకే.. అక్కడికెళ్లి టెన్షన్ పడే బదులు.. ఆ సమయంలో ఎంచక్కా ఇంటి పట్టున ఉండి రిలాక్స్ అయిపోవచ్చు కదా’’ అని అంటోంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more