స్వర్ణ దేవాలయం లేదా హర్మందీర్ సాహిబ్
సంస్కృతిపరంగా సిక్కులకు అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయం అమృతసర్ లో కొలువై వుంది. సిక్కు మతానికి నాల్గవ గురువైన గురు రామదాస్ క్రీ.శ. 1577లో ఒక చెరువును తవ్వించాడు.. కాలగమనంలో ఈ చెరువు అమృతసర్ లేదా అమృత సరోవర్ గా పేరు సాధించింది. ఈ చెరువుకు మధ్యభాగంలోనే హర్మిందీర్ సాహిబ్ పేరుతో ఒక అద్భుతమైన సిక్కు దేవాలయం నిర్మితమైంది.