లీగ్ దశను దాటడానికి అష్ట కష్టాలు పడ్డ జట్టు... అనూహ్య విజయాలతో సెమీస్ అక్కడి నుండి ఫైనల్ కి వచ్చి ఏకంగా కప్ నే ఎగరేసుకొని వెళ్లింది అదే ముంబయి జట్టు. అటు ఐపీఎల్, ఇటు ఛాపింయన్స్ లీగ్ ట్రోఫీలను గెలుచుకొని నిజమైన ఛాంపియన్స్ నిలవడమే కాకుండా, రెండోసారి ఛాంపియన్స్ లీగ్ ట్రోపినీ గెల్చుకున్న జట్టుగా రికార్డు సాధించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్న సచిన్ ని కూడా ఈ ట్రోఫీ గెల్చి గర్వంగా సాగనంపారు. ఇక డిపెండబుల్ ద్రావిడ్ ఈ మ్యాచ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్న ద్రవిడ్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. నిన్న రాత్రి ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని చిత్తు చేసి ముంబయి జట్టు 33 పరుగల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ లీగ్ లో ఆది నుండి హవా కొనసాగిస్తూ వస్తున్న రాజస్థాన్ జట్టు ఫైనల్లో మాత్రం చితికిల పడాల్సి వచ్చింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెనో కాకుండా జట్టు స్కోరులో అంతా భాగస్వాములు అయ్యి తన వంతుగా సాకారాన్ని అందించి భారీ స్కోరు చేశారు. ఓ దశలో పది ఓర్లకు 1 వికెన్ నష్టానికి 65 పరుగులే చేసిన ముంబయి 20 ఓవర్ల వరకు భారీ స్కోరు సాధించింది. డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (14 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ జట్టు తొలి పది ఓవర్లలోనే 105 పరుగులు సాధించి పటిష్టమైన స్థితిలో కనిపించింది. అజింక్యా రహానే (47 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సామ్సన్ (33 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాటం ముగిసిన తరువాత రాజస్థాన్ ఆటగాళ్లు పరుగులు రాబట్టడంలో చితికల పడ్డారు.
చివరి వరకు పోరాడిన రాజస్థాన్ ఆటగాళ్ళు 18.5 ఓర్లకు 169 అలౌట్ అయ్యి, టైటిల్ ని నిలబెట్టుకోలేక పోయింది. చెరో ఓవర్లో మూడేసి వికెట్లు పడగొట్టిన హర్భజన్ (4/32), పొలార్డ్ (3/31) విజయం దిశగా వెళుతున్న రాయల్స్‌ను దెబ్బ తీశారు. చివరి ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ (1) విఫలమయ్యాడు. 32 పరుగుల వ్యవధిలో రాజస్థాన్ చివరి 8 వికెట్లు కోల్పోయి, జైపూర్‌లో అజేయంగా జైత్రయాత్ర కొనసాగించిన రాయల్స్ తన రాతను తానే ఢిల్లీలో మార్చుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more