స్వదేశంలో భారత క్రికెట్ జట్టు పులే. కానీ విదేశీ గడ్డ పై మాత్రం పిల్లి. ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. గత మూడు సంవత్సరాల క్రితం అనుభవం ఉన్న ఆటగాళ్ళతో వెళ్లి ఒక్కటి అంటే ఒక్క సిరీస్ కాదు కదా మ్యాచ్ కూడా గెలవకుండా ఘోర పరాజయం పాలై తిరిగి వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఏ మాత్రం విదేశీ పిచ్ ల పై అనుభవం లేని జట్టుతో వెళ్లిన కుర్ర జట్టు దక్షిణాఫ్రికా పిచ్ లను తట్టుకుంటుందా అనేది ప్రశ్న.
గత సిరీస్ లో ఓడిన ఇండియా ఉద్రేకాల మధ్య సిరీస్‌కు సిద్ధం అయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ రూపంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి వాండరర్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై ఇటీవల పాక్ చేతిలో సిరీస్ ఓడిన దక్షిణాఫ్రికా మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇటీవలి ప్రదర్శన ప్రకారం చూస్తే భారత్ అభేద్యంగా కనిపిస్తున్నా... ఉప ఖండానికి భిన్నమైన పరిస్థితులు ఉండే సఫారీ గడ్డపై ఏ స్థాయి ఆటతీరు కనబరుస్తుందనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికాలో భారత జట్టు గత రికార్డు పేలవంగా ఉండటం ప్రతికూలాంశం. ఆ జట్టుతో ఇక్కడ జరిగిన 25 వన్డేల్లో టీమిండియా 5 మాత్రమే నెగ్గి 19 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక్కడ మన జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేకపోయింది. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more