గత మూడు సంవత్సారాల క్రితం దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్ ఘోర పరాజయాల్ని మూటగట్టుకొన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు యువ రక్తంతో సఫారీల గడ్డ పై అడుగుపెట్టిన టీం ఇండియా పాత కథనే రిపీట్ చేసింది. ఇప్పటి వరకు స్వదేశీ గడ్డపై పులిలా ఉన్న టీం ఇండియా సఫారీ గడ్డ పై ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. పర్యటనకు ముందు సఫారీలకు సవాల్ విసిరిన కుర్రాళ్ళు వాస్తవంలోకి వచ్చారు. మొదటి నుండి భయపడ్డట్లుగానే దక్షిణాఫ్రికా బౌలర్లకు బెంబేలెత్తి పోయారు. ఫలితంగా ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది.
అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా 141 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీం ఇండియా బౌలర్లను సఫారీలు ఓ ఆట ఆడుకున్నారు. హాషిమ్ ఆమ్లా (88 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించగా... చివర్లో డివిలియర్స్ (47 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు ఏ దశలో బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయలేకపోయారు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా 41 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ల రోహిత్, ధావన్ ఐదుగురు పేసర్లు వేస్తున్న బంతులు బుల్లెట్ల తరహాలో దూసుకొస్తుంటే భారత బ్యాటింగ్ సరికొత్త హీరో రోహిత్ శర్మ బంతిని బ్యాట్‌తో తాకించడానికి 16 బంతులు తీసుకున్నాడంటే సఫారీల బౌలింగ్ కి మనవాళ్ళు ఏమాత్రం భయపడ్డారో అర్థం చేసుకొవచ్చు. ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (71 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more