T20 world cup doubt in bangladesh

T20 World Cup, Bangladesh Cricket Board, Chittagong, T20 World Cup 2014, T20 Worldcup doubt in Bangladesh, BCB president, Nazmul Hassan, ICC Board, cricket.

Twenty20 World Cup is threatened by the country deadly political violence.

బంగ్లాలో వరల్డ్ కప్ కష్టమే

Posted: 12/11/2013 10:39 AM IST
T20 world cup doubt in bangladesh

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 6 వరకు బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉన్న టి20 ప్రపంచకప్ టోర్నీ పై నీలి నీడలు కమ్ముకుంటున్నారు. తొలిసారిగా ఓ భారీ టోర్నీకి అతిథ్యం ఇవ్వబోతున్న బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ హింస కొనసాగుతుంది. ఆ కారణంగా టోర్నీ బంగ్లాదేశ్ లో ఉంటుందో ఉండదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హసన్ . గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాయుత పరిస్థితి ఇలాగే కొనసాగితే టోర్నీ నిర్వహించడం కష్టమౌవుతుందని,

ఏదైనా పెద్ద జట్టు హింస కారణంగా ఇక్కడకి రావాలన్నా వెనకా ముందు అవుతుందని, ఈ పరిస్థితి డిసెంబర్ కల్లా లేదా జనవరి కల్లా చక్కబడితేనే సాధ్యం అని ఆయన అన్నాడు. గతంలో 19 జట్టు బస చేసిన హోటల్ వద్ద బాంబు పేళుళ్ళు సంబవించిన కారణంగా విస్టిండీస్ క్రికెట్ బోర్డు పర్యటనను రద్దు చేసుకుంది. టోర్నీకి ఆతిథ్యమిచ్చే ఢాకా, చిట్టగాంగ్, సిల్ హెట్ సహా దేశంలోని అన్ని నగరాల్లో హింస జరుగుతుంది. కానీ గత వారం అక్కడ పర్యటించిన ఐసీసీ సభ్యులు మాత్రం పరిస్థితి పై ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కాబట్టి టోర్నీ అక్కడే నిర్వహించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles