స్వదేశంలో వరుసగా సిరీస్ లు గెలుస్తూ మంచి జోరు మీదున్న టీం ఇండియా సౌతాఫ్రికాలో గెలవడం ఖాయం అనుకున్నారంతా. కానీ అక్కడికి వెళ్తే గానీ తెలియలేదు మనవాళ్ళ సత్తా. ఇక్కడ సెంచరీలు చేసిన వారంతా అక్కడ కనీసం అర్థ సెంచరీ కాదు కదా ? పావు సెంచరీ కూడా చేయలేదు. అక్కడి బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. మొదటి రెండు వన్డేల్లో ఎలాగు ఓడిపోయారు కాబట్టి మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు.
నిన్న జరిగిన మూడో వన్డే వర్షార్పణం అయింది. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డే లో దక్షిణాఫ్రికా పూర్తి ఇన్నింగ్స్‌ను 50 ఓవర్లు ఆడి, 8 వికెట్లు కోల్పోయి 301 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వాంటన్ డి కాక్ (120 బంతుల్లో 101; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ సాధించగా, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (101 బంతుల్లో 109; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకంతో చెలరేగాడు. చివర్లో మిల్లర్ (34 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు.
ఇషాంత్ శర్మ (4/40) ఆకట్టుకున్నాడు.షమీకు 3 వికెట్లు దక్కాయి. ఇన్నింగ్స్ విరామంలో ప్రారంభమైన వాన నిరంతరాయంగా దాదాపు రెండున్నర గంటల పాటు కురిసింది. దాంతో మరో దారి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ ఓ రికార్డు కూడా క్రియేట్ చేసిందోయ్.
అదేంటంటే ఒకే సంవత్సరంలో పదిసార్లు 300 పైగా స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా రికార్డుల్లోకి ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 18 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more