Aussies show upper hand in sydney test even on day two

Australia score day two fourth test, Australia score day two, sydney test india vs australia, fouth test day two Australia score, sydney test day two Australia score, indian bowlers struggle for wickets, aussies dominate indian bowlers, India score day two fourth test, India score day two, 2014 australia vs india, 2014 australia vs india fourth test, aussies vs india sydney test 2014

Aussies batsman continued to torment India as Australia reached a resounding 572 losing 7 wickets and declared first innings of the fourth test

రెండోరోజు ఆసీస్ ఆధిపత్యం.. నిలకడగా ఆడుతున్న భారత్

Posted: 01/07/2015 03:23 PM IST
Aussies show upper hand in sydney test even on day two

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో ఆస్ట్రేలియాలోని సిడ్ని క్రికెట్ గౌండ్స్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబర్చింది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. ఏడవ విక్కెట్ ను కోల్పోయిన తరుణంలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను 572/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ (31), రోహిత్ శర్మ (40) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మురళీ విజయ్ పరుగులేమీ చేయకుండానే మూడో బంతిని ఎదుర్కోని పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ కష్టాలలో పడింది. కాగా, లోకేష్, రాహుల్ ఇద్దరూ నెమ్మదిగా ఆడటంతో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ విక్కెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో అసీస్ కన్నా భారత్ 501 పరుగులు వెనుకబడివుంది.

అంతకుముందు 348/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూలు రెండో రోజూ అదే జోరు కొనసాగించారు. స్టీవెన్ స్మిత్ (117) సెంచరీ, వాట్సన్ (81), షాన్ మార్ష్ (73), బర్న్స్ (58) హాఫ్ సెంచరీలు సాధించారు. లంచ్ లోపు రెండు వికెట్లు తీసిన భారత్ ఆ తర్వాత టీ విరామానికి మరో వికెట్ మాత్రమే తీయగలిగారు. ఆసీస్ స్కోరు అప్పటికే 500 పరుగులు దాటింది. మూడో సెషన్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో షమీ రాణించాడు. ఈ రోజు షమీ నాలుగు వికెట్లు తీశాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  fourth Test  cricket  sydney  

Other Articles