Shane warne confirms dating with emily scott

shane warne confirms dating with emily scott, shane warne, emily scott, sydney, sports news.

Shane Warne confirms dating with Emily Scott

షేన్ వార్న్ మరో గూగ్లీ... మరో ఫిగర్ పడింది ?

Posted: 07/04/2014 11:44 AM IST
Shane warne confirms dating with emily scott

బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేయసి రాళ్ళను పూటకొక్కర్ని ఎలా మారుస్తాడో, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా అలానే మారుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2005లో భార్య సిమోన్‌కు విడాకులిచ్చిన తరువాత కొత్త కొత్త గాళ్ ఫ్రెండ్స్ తో ఎఫైర్లు సాగిస్తున్నాడు. ఏ మాయ చేస్తాడో, ఎలా ఎరవేస్తాడో గానీ తన స్పిన్ బంతులతో వికెట్లు పడేసినట్లుగా అమ్మాయిలను పడేస్తున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత బ్రిటిష్ మోడల్ లిజ్ హార్లీతో ప్రేమాయణం నడిపటమే కాకుండా, ఇద్దరు కలిసి మూడేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు.

ఆమె పై మోజు తీరిందో ఏమో కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాకే చెందిన ప్లేబాయ్ మోడల్ అయిన ఎమిలీ స్కాట్ తో గత కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమాయణం నపుతూ గత నెలలో ఆమెతో ముద్దుల్లో మునిగి తేలుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఆ విషయం అప్పుడే బయటకు వచ్చినా దాని పై మౌనం దాల్చిన వార్న్ ఎట్టకేలకు తన ఎఫైర్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఆ మధ్య ఓ రేడియోకి ఇచ్చిన ఇంటర్వూలో మోడర్న్ ఫ్యామిలీ టెలివిజన్ సీరియల్ తార సోఫియా వెర్గరాతో డేటింగ్ చేయాలని ఉందని షేన్ వార్న్ ఓ రేడియో కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈమెతోనైనా చివరి వరకు ఉంటాడో ? కొన్నాళ్ళ తరువాత మరొకర్ని చూసుకుంటాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles