Sachin fans attack sharapova in twitter

sachin fans attack sharapova in twitter,. sachin fans attack sharapova, sachin fans demand apology, fans attack sharapova on social media

Sachin fans attack Sharapova in twitter

షరపోవా నోటి దులకు ఫలితం ఇది ?

Posted: 07/04/2014 12:29 PM IST
Sachin fans attack sharapova in twitter

ప్రపంచ క్రికెట్ దేవుడిగా పేరు సంపాదించుకున్న సచిన్ అంటే మనదేశంతో పాటు ప్రపంచ దేశాల వారికి కూడా తెలుసు. మన దేశంలో అయితే ఏ చిన్న పిల్లడ్ని క్రికెట్ గురించి అడిగినా సచిన్ గురించే ముందు చెబుతారు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సచిన్ అంటే ఎవరో నాకు తెలియదు అని రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యల పై మనదేశ సచిన్ అభిమానులే కాకుండా వివిధ దేశాల వారు కూడా ఆమె పై దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు షరపోవా ఎవరంటూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దుమ్మెత్తి పోశారు. షరపోవా ట్విట్టర్ అకౌంట్‌లో ఏనాడూ లేని స్థాయిలో ట్వీట్స్ వెల్లువెత్తాయి. ‘దేవుడినే గుర్తు పట్టదా? ఆమెకు బుద్ది చెప్పాల్సిందే ’ అని ఓ ఫ్యాన్ ఆవేశం ప్రదర్శిస్తే... ‘స్విట్జర్లాండ్‌లో క్రికెట్ ఆడకపోయినా ఫెడరర్ ఎంతో వినయంతో సచిన్‌తో మాట్లాడతాడు.

రష్యాలో క్రికెట్ ఆడరనే సాకుతో సచిన్ తెలియదని వ్యాఖ్యానించడం మూర్ఖత్వం ’ అంటూ మరో అభిమాని విరుచుకుపడ్డాడు. దీనికి ప్రతిగా ‘పుతిన్ ఎవరో నాకు తెలియదని మోడి చెప్పాలి ’ అని ఓ అభిమాని రాశాడు. ఒక్కసారి నోరు జారినందుకే ఫ్యాన్స్ తో ఇంతటి ఆగ్రహాన్ని చవిచూస్తున్న షరపోవా త్వరలోనే దిగి వచ్చి సారీ చెబుతుందనడంలో సందేహం లేదు.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles