Brazil beat colombia

Brazil enter World Cup semifinal, Brazil beat Colombia 2-1, Brazil hard-earned quarterfinal win over Colombia, Germany overpower France.

Brazil enter World Cup semifinal

గెలిచినా నిలవని ఆనందం..

Posted: 07/05/2014 11:38 AM IST
Brazil beat colombia

అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాకర్ ఫుట్ బాల్ కప్ సమరం చివరి అంకానికి చేరుకుంది. బంగారు కప్ ని అందుకోవడానికి రేసులో ఉన్నజట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్న ఆతిధ్య దేశం బ్రెజిల్, జర్మనీ జట్లు సెమీఫైనల్ కి చేరుకున్నాయి. ప్రాన్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జర్మనీ 1-0 తేడాతో ఓడించి వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ సెమీస్ కి చేరుకోవడమే కాకుండా, ఇంత వరకు ఫుట్ బాల్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో 13వ సారి సెమీలోకి దూసుకెళ్లి కొత్త రికార్డును సాధించింది. మరో మ్యాచ్ లో బ్రెజిల్ కొలంబియాను 2-1 తేడాతో ఓడించి సెమీస్ బెర్త్ ను సొంతం చేసుకుంది. బ్రెజిల్ పేరుకే గెలిచినా, కొలంబియా తీవ్రంగా పోరాడి గట్టి పోటీనిచ్చింది.

బ్రెజిల్ సెమీ ఫైనల్ చేరినా ఆ ఆనందం వారికి మిగల్లేదు. కారణం, స్టార్ ఫార్వర్డ్ నేమార్ తీవ్రంగా గాయపడి సెమీస్ కు దూరమవడమే. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ 2-1తో విజయభేరి మోగించింది. అయితే, బంతితో ముందుకు దూసుకెళుతున్న నేమార్ ను కొలంబియా ఆటగాడు జునిగా వెనకనుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో, ఈ బక్కపలుచని ఫార్వర్డ్ బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని డగౌట్ కు తరలించారు. వైద్యులు అతడికి కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని సూచించడంతో సెమీఫైనల్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles