Sania mirza reach top 5 rank in her career

sania mirza reach top-5 rank in her career, indian tennis ace sania mirza, sania and partner cara black, zimbabwean player cara black,

sania mirza reach top-5 rank in her career,

డబుల్స్ లో సానియాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్

Posted: 07/07/2014 12:56 PM IST
Sania mirza reach top 5 rank in her career

మణికట్టుకు గాయం కావడంతో ఇటీవలి కాలంలో సంచలనాలు సృష్టించలేకపోతున్న భారత టెన్నిస్ స్టార్ తన టెన్నిస్ కెరియర్లోనే అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకుంది. నేడు డబ్ల్యుటీఏ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో సానియా టాప్ - 5 లోకి దూసుకొచ్చింది. సానియా మీర్జాతో పాటు జింబాబ్వేకు చెందిన ఆమె డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ వింబుల్డన్లో అత్యంత కీలకమైన 130 ర్యాంకింగ్ పాయింట్లు సాధించిడంతో సానియా ఐదో ర్యాంకులోకి దూసుకొచ్చింది.

ఇప్పటి వరకు మూడుసార్లు మణికట్టుకు సర్జరీ అయిన తరువాత కూడా సానియా ఇటీవలి కాలంలో రాణిస్తుందంటే అభినందించాల్సిన విషయం. తనకు మూడోసారి సర్జరీ అయిన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడటం చాలా ఇబ్బంది అయ్యిందని చాలా సార్లు చెప్పుకొచ్చిన సానియా ఐదో ర్యాకుంకు దూసుకురావడంతో ఆమె తండ్రి , కోచ్  ఇమ్రాన్ మీర్జా సంతోషం వ్యక్తం చేశారు. సానియాకు పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఆమె ఎప్పుడో ఈ స్థానాన్ని సొంతం చేసుకునేదని, ఆమెకు టాప్ -5 సాధించే సామార్ధ్యం ఉందని చెప్పుకొచ్చాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles